సాధారణంగా సినిమా షూటింగ్స్ లో నటీ, నటులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వాటిని సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా నాని హీరోగా తెరకెక్కిన ‘దసరా’ మూవీలో తాను పడ్డ కష్టాలను చెప్పుకొచ్చింది నటి పూర్ణ. అదీకాక దసరా మూవీ షూటింగ్ తన ప్రెగ్నెన్సీ టైమ్ లోనే పూర్తి చేసినట్లు పేర్కొంది. ఇక మూవీ షూటింగ్ టైమ్ లో అర్దరాత్రి తన వెంట కుక్కలు వెంటపడ్డాయని భయానక సంఘటనను గుర్తు చేసుకుంది పూర్ణ.
నటి పూర్ణ.. రవిబాబు తెరకెక్కించిన ‘అవును’ సినిమా ద్వారా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో మెరిసినప్పటికీ.. ఆ చిత్రాలు అనుకున్నంతగా ఆడలేదు. ఇక సినిమాలతో పాటుగా పలు టీవీ షోల్లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తూనే ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా మారిన పూర్ణ.. ఇటీవలే అమ్మగా ప్రమోషన్ పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పిల్లాడి ఆలనాపాలనతో బిజీగా ఉన్నప్పటికీ పలు షోలతో, సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉంది పూర్ణ.
తాజాగా తాను నటించిన దసరా మూవీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది పూర్ణ. దసరా మూవీలో ఎక్కువ సన్నివేశాలు రాత్రివేళల్లోనే షూట్ చేశారని, దీంతో చలికి ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది పూర్ణ. అదీకాక దసరా మూవీ తాను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే చేశానని, రాత్రి పూట ఓ సీన్ షూట్ చేసేటప్పుడు నిర్మానుష్యమైన రోడ్డుపై పరిగెత్తాల్సి వచ్చిందని, అప్పుడు వీధి కుక్కల అరుపులకు భయపడ్డానని, అయితే అదృష్టవశాత్తు అవి తనను కరవలేదని పూర్ణ తెలిపింది. ఆ సీన్లో తన కాళ్లకు చెప్పులు లేకుండా పరిగెత్తాల్సి వచ్చిందని దసరా షూటింగ్ అనుభవాలను పంచుకుంది.