ధనుష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బ్యూటీని గుర్తుపట్టారా?

  • Author Soma Sekhar Updated - 06:57 PM, Tue - 8 August 23
  • Author Soma Sekhar Updated - 06:57 PM, Tue - 8 August 23
ధనుష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ బ్యూటీని గుర్తుపట్టారా?

ఇండస్ట్రీలోకి ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది చైల్డ్ ఆర్టిస్టులు సీరియల్స్ లో నటిస్తూ.. తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక తమకు లభించిన అవకాశాలను ఉపయోగించుకుంటూ.. క్యూట్ యాక్టింగ్ తో అలరిస్తుంటారు చైల్డ్ ఆర్టిస్టులు. ఈ పాప కూడా తన నటనతో అలరించింది. మనకు బాగా తెలిసిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ కు చెల్లిగా నటించింది. అది ఏ సినిమానో మీరు గుర్తుపట్టారా? మీకు ఇంకో క్లూ ఇస్తాను ఆ సినిమాలో స్టార్ హీరో ధనుష్. ఇప్పటికైనా మీకు గుర్తుకు వచ్చిందా?

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ధనుష్ హీరోగా నటించిన ఓ చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్రలో నటించింది. ఇక ఆ సినిమా తర్వాత సీరియల్స్ లో హీరోయిన్ పాత్రలు చేస్తోంది ఈ అమ్మడు. ఈ బ్యూటీ పేరు గాబ్రియోలా నటాలియా ఛార్లటెన్. గాబ్రియోలా పేరుతో ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది ఈ సోయగం. తొమ్మిదేళ్ల వయసులోనే తన కెరీర్ ను స్టార్ట్ చేసింది గాబ్రియోలా. ఓ ఛానల్ లో ప్రసారమైన డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది. ఆ తర్వాత ‘జోడీ నంబర్ వన్’ అనే డ్యాన్స్ షోలో పాల్గొని విజేతగా నిలిచింది ఈ బ్యూటీ.

 

ఇలా బుల్లితెరపై పలు షోలతో పాటు.. ప్రస్తుతం చేతినిండా సీరియల్స్ తో ఫుల్ బిజీగా ఉంది గాబ్రియోలా. ఈ అమ్మడు ధనుష్ హీరోగా నటించిన ‘త్రీ’ మూవీలో హీరోయిన్ శృతిహాసన్ చెల్లెలి పాత్రలో నటించింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో నటించి ఆకట్టుకుంది గాబ్రియోలా. కాగా.. సీరియల్స్ లో చీరకట్టుతో పద్దతిగా కనిపించే ఈ సోయగం.. సోషల్ మీడియాలో మాత్రం మోడ్రన్ డ్రెస్సుల్లో మైమరపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దీంతో హీరోయిన్ లా ఉంది ఎవరీ అందం అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఈమెని చూడగానే మీలో ఎంతమంది గుర్తుపట్టారో కామెంట్స్ చేయండి.


ఇదికూడా చదవండి: చిత్ర పరిశ్రమ పిచ్చుక అని అంగీకరించారా? మెగాస్టార్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్!

Show comments