iDreamPost
android-app
ios-app

బెగ్గింగ్‌ క్వీన్‌.. అడుక్కుని కోట్లు సంపాదించిందట!

ఏమాత్రం చదువు అబ్బకపోతే భిక్షాటనే దిక్కు. పోని అడుక్కుంటే ఏమైనా విలువ అంటే.. చాలా దేశాల్లో బిక్షాటనంటే అదే ఏదో నేరంలా చిన్న చూపు చూస్తారు. అయితే దీనికి పూర్తి భిన్నం గా ఓయువతి వ్యవహరించింది. కష్టపడి చదవడంకన్నా.. భిక్షాటన చేసి కోటిశ్వరులు కావడం మేలు. అని అందరీని ఆశ్చర్యపరిచేలా చేసింది.

ఏమాత్రం చదువు అబ్బకపోతే భిక్షాటనే దిక్కు. పోని అడుక్కుంటే ఏమైనా విలువ అంటే.. చాలా దేశాల్లో బిక్షాటనంటే అదే ఏదో నేరంలా చిన్న చూపు చూస్తారు. అయితే దీనికి పూర్తి భిన్నం గా ఓయువతి వ్యవహరించింది. కష్టపడి చదవడంకన్నా.. భిక్షాటన చేసి కోటిశ్వరులు కావడం మేలు. అని అందరీని ఆశ్చర్యపరిచేలా చేసింది.

బెగ్గింగ్‌ క్వీన్‌.. అడుక్కుని కోట్లు సంపాదించిందట!

భిక్షాటన చేస్తూ కోట్లు సంపాదించడం, వ్యాపారం చేయడం అనేది సాధారణ విషయం కాదు. కష్టపడి చదువుకున్న వాళ్లే పై స్థాయికి రావాలంటే నానాతంటాలు పడతారు. అలాంటిది ఏకంగా కోట్లు సంపాదించి ధనవంతులు కావడం అంటే.. చిన్న మాట కాదు. అయితే.. పాకిస్థాన్ కి చెందిన ఓ యువతి కథ వింటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఆ యువతి కేవలం భిక్షాటన చేసి కోట్లు సంపాదించింది. ఇళ్లు, కారు కొంది. బిజినెస్‌ కూడా చేస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద సెలెబ్రిటీ కూడా అయిపోయింది.

ఆ వివరాల్లోకి వెళితే… పాకిస్థాన్‌కు చెందిన లైబా అనే యువతి కొద్దిరోజుల క్రితం అక్కడి ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తనకు ఉన్న ఆస్తుల గురించి చెప్పుకొచ్చింది. అవన్నీ ఎలా సంపాదించారు అని రిపోర్టర్‌ అడగ్గా.. అడుక్కుతిని సంపాదించా అని ఆమె చెప్పింది. ఏదీ దాచకుండా ఎంతో నిజాయితీగా అన్ని విషయాలు చెప్పుకొచ్చింది. ఇద్దరి మధ్యా సంభాషణ ఇలా జరిగింది…

రిపోర్టర్‌ : నమస్కారం..
లైబా : నమస్కారం..
రిపోర్టర్‌ : ఎలా ఉన్నారు?
లైబా : బాగున్నాను..
రిపోర్టర్‌ : మీరు మలేషియాలో ఉంటారా?
లైబా : అవును!
రిపోర్టర్‌ : మలేషియాలో మీకు ఏమి ఏమి ఉన్నాయి..
లైబా : రెండు ఫ్లాట్లు, ఓ కారు, బిజినెస్‌ కూడా ఉంది.
రిపోర్టర్‌ : మీ వాళ్లందరూ అక్కడే ఉంటారా?
లైబా : అవును !
రిపోర్టర్‌ : మీరు ఇంత ధనవంతులు ఎలా అయ్యారు?
లైబా : భిక్షం ఎత్తి..
రిపోర్టర్‌ : మీరు చెప్పేది నిజమేనా?
లైబా : అవును!
రిపోర్టర్‌ : ఐదేళ్లలో ఇదంతా సంపాదించారా?
లైబా : అవును!
రిపోర్టర్‌ : మీరు ఏవిధంగా భిక్షమెత్తేవారు?
లైబా : మాసిపోయిన బట్టలు వేసుకుని, చేతిలో పుస్తకాలు పట్టుకుని.. అన్నీ అబద్ధాలు చెప్పే దాన్ని.. మాది చాలా పేద కుటుంబం. నేను సంపాదిస్తేనే నా కుటుంబం గడుస్తుంది. మా నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇలా కట్టు కథలు చెప్పేదాన్ని.

అంటూ లైబా తన భిక్షాటన జీవితం గురించి చెప్పుకొచ్చింది. తను ఏ ఏ ఏరియాల్లో భిక్ష మెత్తిందో కూడా చెప్పుకొచ్చింది. ఎంతో నిజాయితీగా, విశ్వాసంతో కూడిన ఆమె మాటాలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం xలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ బెగ్గింగ్‌ క్వీన్‌’’.. ‘‘ అడుక్కుతిని డబ్బులు సంపాదించా అని చెప్పటానికి కూడా ధైర్యం ఉండాలి’’.. ‘‘ ఆమె నిజంగానే చెబుతోందా? లేక కామెడీ చేస్తోందా? భిక్షం ఎత్తి కోట్లు సంపాదించటం ఎంటి?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, భిక్షాటన చేసి కోట్లు సంపాదించా అంటున్న లైబాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişbahis siteleri