iDreamPost
android-app
ios-app

మీమ్స్‌లో నిత్యం కనిపించే ఈ ర్యాపర్ గుర్తున్నాడా? ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడంటే?

  • Published Apr 20, 2024 | 4:02 PM Updated Updated Apr 20, 2024 | 4:29 PM

ఒక్క వీడియో, ఒక్క ఎక్స్ ప్రెషన్ కొంత మందిని ఓవర్ నైట్ స్టార్ ను చేసేస్తోంది. ఇదిగో ఈ ఫోటోలో వ్యక్తి కూడా అలా మీమర్ల పాలిట గాడ్ గా మారాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఒక్క వీడియో, ఒక్క ఎక్స్ ప్రెషన్ కొంత మందిని ఓవర్ నైట్ స్టార్ ను చేసేస్తోంది. ఇదిగో ఈ ఫోటోలో వ్యక్తి కూడా అలా మీమర్ల పాలిట గాడ్ గా మారాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

  • Published Apr 20, 2024 | 4:02 PMUpdated Apr 20, 2024 | 4:29 PM
మీమ్స్‌లో నిత్యం కనిపించే ఈ ర్యాపర్ గుర్తున్నాడా? ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడంటే?

సోషల్ మీడియా పుణ్యమా అని అనామకులు సైతం ఫేమస్ అవుతున్నారు. ఎప్పుడు ఎలా పాపులర్ అవుతారో చెప్పడం కష్టం. పెద్ద పెద్ద మ్యాజిక్స్ చేయనక్లర్లేదు. చిన్న ఎక్స్ ప్రెషన్స్‌తో కూడా ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. అందుకు ఉదాహరణ.. ప్రతి రోజు యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో ఏదైనా వీడియో చూస్తుండగా మధ్యలో ఓ వ్యక్తి బిగ్గరగా నవ్వుతూ ఉన్న మీమ్ కనిపిస్తుంది. హార్రర్ వీడియో గేమర్ ముతహర్ అన్స్ అనే వ్యక్తి.. గేమ్స్ ఆడుతూ.. బిగ్గరగా నవ్వుతాడు. ఇది ఓ మీమ్ టెంప్లెంట్ అయ్యింది. అలాగే ఓ ర్యాపర్ పెట్టిన ఎక్స్ ప్రెషన్ అతడికి విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది.

ఇద్దరు ర్యాపర్స్ మధ్య జరిగిన గొడవలో ఓ ర్యాపర్ డైలాగ్ చెప్పడంతో అక్కడే ఉన్నవారంతా.. ఒక్కసారిగా అరుస్తూ ఉంటారు. కానీ అతడు ఓ వింతగా ఫేస్ పెడుతుంటాడు. ఇది ఎంత ఫేమస్ అయ్యిందంటే.. అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అతడు ఎవరంటే.. డేషాన్ రా. అప్పట్లో అనేక మీమ్స్‌లకు టెంప్లెంట్‌గా వాడారు అతడి ఫేస్ రియాక్షన్స్‌ని. 2011లో జరిగిన ర్యాపర్ ఫైట్స్ జరిగిన సమయంలో డేషాన్ రా.. ఓ లైన్ చెప్పగానే.. అక్కడ ఉన్న వాళ్లంతా అరుస్తూ ఉంటారు. అంతలో ఈ ర్యాపర్ డిఫరెంట్ ఫేస్ ఎక్స్ ప్రెషన్ పెట్టాడు. ఇది ఎంతో ఫేమస్ అయ్యింది. ఇంతకు ఆ వీడియోలో అతడు ఏమంటాడంటే..?

సూపర్ హాట్ ఫైర్ పేరుతో ఇద్దరు ర్యాపర్స్ మధ్య ఫైట్ జరిగింది. అందులో పాల్గొన్న ర్యాపర్, యూట్యూబర్, ది ర్యాప్ బాటిల్ పేరడీస్ వెబ్ సిరీస్ సృష్టికర్త, కమెడియన్ డేషాన్ రా..‘ఏ ఏ ఏ.. బ్రోక్ మై ఎక్స్ గర్ల్.. హిజ్ నంబర్’ అని మరో వ్యక్తికి నంబర్ ఇస్తాడు. ’సైక్ దట్స్ ద రాంగ్ నంబర్‘ అని డేషాన్ రా అనగానే.. అక్కడ ఉన్న మిగిలిన వాళ్లంతా మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ చేసినట్లు అరుస్తూ ఉంటారు. అప్పుడు డేషాన్ రా క్యూట్ ఎక్స్ ప్రెషన్ పెడతాడు. దీన్నే చాలా యూట్యూబ్ వీడియోల్లో మీమ్స్‌గా వాడేశారు. అలా అందరికీ పరిచయం అయ్యాడు ఇతడు.  దీంతో అతడి జీవితమే మారిపోయింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని రాంచో కుకమెంగాలో నివసిస్తున్నాడు. ఈ ర్యాప్ బాటిల్ పేరడీస్ సిరీస్‌తో మరింత పాపులర్ అయ్యాడు. ఇప్పుడు డేషాన్ రా చూస్తే గుర్తు పట్టడం కష్టం. ఇన్ స్టాలో కూడా అతడికి లక్షకు మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet