వీడియో: ATM నుంచి డబుల్ క్యాష్.. క్యూ లైన్ లో బారులు తీరిన కస్టమర్స్!

ATM నుంచి నుంచి డబుల్ క్యాష్ వస్తుందని తెలియడంతో కొందరు కస్టమర్స్ అక్కడ బారులు తీరారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ATM నుంచి నుంచి డబుల్ క్యాష్ వస్తుందని తెలియడంతో కొందరు కస్టమర్స్ అక్కడ బారులు తీరారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

మాములుగా అప్పుడప్పుడు కొన్ని ఏటీఎం మిషన్ లలో సాంకేతిక కారణాల వల్ల డబ్బు రూ.1000 ఎంటర్ చేస్తే వెంటనే రూ. 2000 వచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ విషయం తెలుసుకుని కొందరు సామాన్య ప్రజలు ఆ ఏటీఎం మిషన్ వద్దకు పరుగులు తీసి అందులో ఉన్న డబ్బును తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా చోట్ల జరిగాయి. అయితే అచ్చం ఇలాంటి ఘటనే ఇటీవల మరో చోట వెలుగు చూసింది. ఏటీఎం మిషన్ నుంచి డబుల్ మనీ వస్తుందన్న విషయం తెలుసుకుని ఆ ఏటీఎం మిషన్ ముందు కస్టమర్స్ బారులు తీరారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇదంతా నిజమేనా? అసలేం జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లండన్ లోని ఓ ప్రాంతంలో ఉన్న ఓ ఏటీఎం వద్ద కొందరు వ్యక్తులు క్యూ లైన్ లో నిలబడి కొంత దూరం వరకు బారులు తీరారు. ఈ సీన్ చూసిన మరి కొందరు వ్యక్తులు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటున్నారేమో అని అనుకుంటూ వెళ్లి పోతున్నారు. కానీ, అక్కడ ఏటీఎంలో కొంత డబ్బు కొడితే దానికి డబుల్ క్యాష్ వస్తుందని అక్కడున్న వ్యక్తులు చర్చించుకుంటున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తులు వెంటనే ఏటీఎం కార్డు బయటకు తీసి ఆ మిషన్ ముందున్న క్యూ లైన్ లో నిలబడ్డారు.

ఇలా ఈ విషయం ఒకరి నుంచి ఒకరికి తెలియడంతో కొన్ని నిమిషాల్లోనే కస్టమర్స్ అంత ఆ డబుల్ క్యాష్ తీసుకునేందుకు బారులు తీరారు. మరి కొందరైతే ముందున్న వారిని తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇదంతా గమనించిన మరి కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇకపోతే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ ఒక్కోరు ఒకలా స్పందిస్తున్నారు. ఇదంతా ఫేక్ అని కొందరంటుంటే.. ఏటీఎంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments