iDreamPost
android-app
ios-app

టీవీ యాడ్స్‌లో తరచూ కనిపించే ఈయన ఎవరో తెలుసా?

  • Published Dec 29, 2023 | 1:12 PM Updated Updated Dec 29, 2023 | 3:50 PM

ప్రమోషన్ల కోసం కోట్లు పెట్టి హీరోలను తీసుకునే సంస్కృతి బాగా తగ్గుతోంది. ఎవరి వస్తువును వారే మార్కెటింగ్‌ చేసుకుంటున్నారు. ఈ ఫొటోలోని వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు.

ప్రమోషన్ల కోసం కోట్లు పెట్టి హీరోలను తీసుకునే సంస్కృతి బాగా తగ్గుతోంది. ఎవరి వస్తువును వారే మార్కెటింగ్‌ చేసుకుంటున్నారు. ఈ ఫొటోలోని వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు.

  • Published Dec 29, 2023 | 1:12 PMUpdated Dec 29, 2023 | 3:50 PM
టీవీ యాడ్స్‌లో తరచూ కనిపించే ఈయన ఎవరో తెలుసా?

ప్రాడెక్టు ఏదైనా కావచ్చు.. దాన్ని అమ్మాలనుకున్నపుడు.. మార్కెట్‌లోకి బలంగా తీసుకెళ్లాలనుకున్నపుడు ‍ప్రమోషన్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత ప్రమోషన్‌ చేస్తే మార్కెట్‌లో ప్రాడెక్టు గురించి అంత తెలుస్తుంది. ప్రజల్లోకి అంత లోతుగా వెళుతుంది. అందుకే పెద్ద పెద్ద కంపెనీల నుంచి చిన్న చిన్న కంపెనీలు కూడా బ్రాండ్‌ ప్రమోషన్‌ చేస్తున్నాయి. పెద్ద కంపెనీలు సెలెబ్రిటీలకు కోట్లు ఇచ్చి ప్రమోట్‌ చేయిస్తుంటే.. చిన్న కంపెనీలు మాత్రం టీవీల్లోనో.. పేపర్లలోనే యాడ్లు ఇస్తున్నాయి.

అయితే, కొంతమంది మాత్రం తమ ప్రాడెక్టును స్వయంగా ప్రమోట్‌ చేసుకుంటున్నారు. ఇందుకు లలితా జ్యువెలర్స్‌ యజమాని కిరణ్‌ కుమార్‌ ప్రత్యక్ష ఉదాహరణ. తన నగల దుకాణం యాడ్‌లో తానే స్వయంగా నటించారు. దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యారు. అందరూ ఆయన్ని గుండు బాస్‌ అంటూ ముద్దుగా పిలుస్తూ ఉన్నారు. ‘‘ డబ్బులు ఎవరికీ ఊరికే రావు!’’ అన్న డైలాగ్‌ చాలా పాపులర్‌ అయింది. జనాల్లోకి బాగా వెళ్లింది. కిరణ్‌ కుమార్‌ మీద, ఆ డైలాగ్‌ మీద చాలా మీమ్స్‌ వచ్చాయి.

Do you know who this guy is who is often seen in TV ads

ఇక, అసలు విషయానికి వస్తే.. పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిని మీరు టీవీల్లో, యూట్యూబ్‌లో తరచుగా చూస్తూనే ఉంటారు. ఆయనే స్వర్గసీమ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చండ్ర చంద్రశేఖర్‌. స్వర్గసీమ బ్రాండ్‌ ప్రమోషన్‌ను స్వయంగా ఆయనే చూసుకుంటున్నారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కిరణ్‌ కుమార్‌ బాటలో తన ప్రాడెక్టును తానే ప్రమోట్‌ చేస్తున్నారు. పలు రకాల యాడ్స్‌తో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచిత వ్యక్తిగా మారిపోయారు.

చంద్రశేఖర్‌ దాదాపు 20 ఏళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉంటున్నారు. కన్‌స్ట్రక్షన్‌, ఓపెన్‌ ప్లాట్‌ సేల్స్‌లో అనుభవం గడించారు. సక్సెస్‌ ఫుల్‌ బిల్డర్‌గా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2017లో స్వర్గసీమ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. కేవలం బిల్డర్‌గానే కాకుండా కౌన్సిలర్‌గా కూడా ఆయన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘ చండ్ర చంద్రశేఖర్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానల్‌ను దాదాపు రెండు లక్షల మంది ఫాలో అవుతున్నారు.

Do you know who this guy is who is often seen in TV ads

ఇందులో వృత్తికి సంబంధించిన విషయాలే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వీడియోలను కూడా ఆయన షేర్‌ చేస్తూ ఉంటారు. ఆ వీడియోలు లక్షలు, మిలియన్ల వ్యూస్‌ గడిస్తూ ఉన్నాయి. మిగిలిన సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామలలో కూడా ఆ వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. మరి, తన ప్రాడెక్టుకు తానే బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న స్వర్గ సీమ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చండ్ర చంద్రశేఖర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet