iDreamPost
android-app
ios-app

బట్టల కొట్టు యజమాని కొడుకు చేసిన పనికి రోడ్డెక్కిన యువతి!

  • Published May 25, 2024 | 11:56 AM Updated Updated May 25, 2024 | 11:56 AM

Young Woman At Lover House: ప్రేమించే ముందు గుర్తురాని తల్లిదండ్రులు అన్ని అవసరాలు తీరిపోయాక పెళ్లి చేసుకోవడానికి మాత్రం గుర్తొస్తారు. తల్లిదండ్రులు ఒప్పుకోరని తెలిసి ప్రేమించడం దేనికి? ఒప్పుకోకపోతే ఒప్పించడం చేతగానప్పుడు ప్రేమ పేరుతో జీవితాలతో ఆడుకోవడం దేనికి? బట్టల కొట్టు యజమాని చేసిన పనికి ఒక యువతి రోడ్డెక్కింది.

Young Woman At Lover House: ప్రేమించే ముందు గుర్తురాని తల్లిదండ్రులు అన్ని అవసరాలు తీరిపోయాక పెళ్లి చేసుకోవడానికి మాత్రం గుర్తొస్తారు. తల్లిదండ్రులు ఒప్పుకోరని తెలిసి ప్రేమించడం దేనికి? ఒప్పుకోకపోతే ఒప్పించడం చేతగానప్పుడు ప్రేమ పేరుతో జీవితాలతో ఆడుకోవడం దేనికి? బట్టల కొట్టు యజమాని చేసిన పనికి ఒక యువతి రోడ్డెక్కింది.

  • Published May 25, 2024 | 11:56 AMUpdated May 25, 2024 | 11:56 AM
బట్టల కొట్టు యజమాని కొడుకు చేసిన పనికి రోడ్డెక్కిన యువతి!

ప్రేమలో ఉన్నప్పుడు గుర్తురాని స్టేటస్ లు, ఆస్తులు, అంతస్తులు పెళ్లి ఊసెత్తితే వచ్చేస్తాయి. అప్పటి వరకూ గుర్తులేని తల్లిదండ్రులు పెళ్లి మాట ఎత్తితే గుర్తొచ్చేస్తారు. అమ్మో స్థాయి తక్కువ అమ్మాయితో పెళ్లి అంటే మా ఇంట్లో ఒప్పుకోరు అని అంటారు. మరి ప్రేమించడానికి ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అడుగుతారా వీళ్ళు? ప్రేమించడానికి పేరెంట్స్ నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదు గానీ పెళ్ళికి మాత్రం పర్మిషన్ కావాలి. ఒప్పుకోకపోతే అమ్మాయిని వదిలేస్తారు. ఈ చేసేదేదో ప్రేమించక ముందు చేసి ఉంటే అమ్మాయిలు పెళ్లి చేసుకోమని ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగరు కదా. అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేయాలన్న దురుద్దేశమా? అలా అయితే జైలే గతి. అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేస్తే శిక్ష తప్పదు.

తాజాగా ఓ వ్యక్తి ఉమ అనే యువతిని ప్రేమించాడు. నాలుగేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు ఆమెను వదిలేశాడని.. రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడని ఆమె వాపోయింది. దీంతో ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. నీలా టెక్స్ టైల్స్ ఓనర్ కొడుకు.. కొన్నేళ్ల క్రితం పాలకుర్తిలో పరిచయం అయ్యాడని.. నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నామని ఆమె తెలిపింది. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఆమె వాపోయింది. పెళ్లి చేసుకుంటా అని చెప్పి రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడని వెల్లడించింది.

మార్చి 12న పెళ్లి చేసుకుంటా అని చెప్పి చీర కొనిచ్చాడని.. కానీ రాలేదని.. దీంతో ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డానని ఆమె పేర్కొంది. తర్వాత ఇంట్లో ఒప్పిస్తా, పెళ్లి చేసుకుంటా అని చెప్పాడని.. వాళ్ళ ఇంట్లో అతని తల్లి ఒప్పుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని ఆమె వెల్లడించింది. అయితే అక్కడ పోలీసుల ముందు హామీగా ఒక లెటర్ రాసి ఇచ్చారని.. పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకున్నారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత అబ్బాయి స్వామి మాల వేసుకున్నాడని.. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కుదరదని చెబుతున్నాడని వాపోయింది. అతని పేరు గోవింద రాజు అని.. తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişjojobet girişcasibomcasibom