ఆదర్శంగా నిలుస్తున్న మహిళా టీచర్లు.. మాకు ఫ్రీ బస్ జర్నీ వద్దంటూ నిర్ణయం

ప్రభుత్వ మహిళా టీచర్లు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మీ పథకం ద్వారా ఫ్రీ జర్నీ తమకు వద్దంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బస్సుల్లో టికెట్ తీసుకుని ప్రయాణిస్తామని వెల్లడించారు.

ప్రభుత్వ మహిళా టీచర్లు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మీ పథకం ద్వారా ఫ్రీ జర్నీ తమకు వద్దంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బస్సుల్లో టికెట్ తీసుకుని ప్రయాణిస్తామని వెల్లడించారు.

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా మహిళలకు, ట్రాన్స్ జెండర్స్ కు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెల్సిందే. మరి ఫ్రీగా వస్తే దేనినైనా ఎవరు కాదంటారు.. దీంతో బస్సులలో రద్దీ అధికంగా పెరిగింది. దీని వలన ఆటో కార్మికుల ఉపాధికి భారీ నష్టం కలిగిందని చెప్పి తీరాలి. ఇక రాష్ట్రంలోని మహిళలందరూ ఈ ఫ్రీ బస్సు ప్రయాణాన్ని విరివిగా ఉపయోగించుకుంటున్న తరుణంలో.. కొంతమంది మహిళలు మాత్రం మాకు ఈ ఫ్రీ సర్వీస్ వద్దంటూ.. మేము టికెట్ తీసుకుని ప్రయాణం చేస్తామంటూ.. వార్తల్లో నిలిచారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మం రూరల్ వెంకటాయపాలెంకు చెందిన మహిళా ప్రభుత్వ టీచర్లు.. ఈ ఆదర్శవంతమైన నిర్ణయాన్ని వ్యక్తపరిచారు. ఫ్రీ సర్వీస్ అందించే ఈ పథకం తమకు వద్దని. తమకు టికెట్ తీసుకుని ప్రయాణం చేసేంత ఆర్థిక స్థోమత ఉందని తెలిపారు. టికెట్ కు డబ్బులు చెల్లించి ప్రభుత్వానికి తమ వంతు సహాయం చేస్తామని ఆ మహిళలు ముందడుగు వేశారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పేదలు, విద్యార్థులు మాత్రం ఉపయోగించుకుంటే చాలని, అది వారికీ మాత్రమే ఎంతో అవసరమని వారు చెప్పుకొచ్చారు. ఈ మేరకు వారంతా కలిసి ఫ్రీ బస్సు సర్వీస్ ను ఉపయోగించుకోకూడదని తీర్మానం చేసుకున్నారు. అంతే కాదు దీనికి సంభందించిన ఓ లెటర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారు విడుదల చేసిన లెటర్ ఇలా ఉంది.

స్కూల్ అసిసెంట్స్ అసోషియేషన్ :
ఈరోజు 15.12.2023 కాంప్లెక్స్ మీటింగ్ లో మహిళా మణులంతా ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రభుత్వ ఉద్యోగం చేసే మేమంతా ఫ్రీ బస్సు, ఫ్రీ టికెట్ వాడుకోవద్దని నిర్ణయం తీసుకున్నాం. TSRTC భవిష్యత్తు కోసం, వృద్దులు, కాలేజీ పిల్లలకు వదిలేద్దాం అనుకుంటున్నాం. అలాగే క్యాబ్ వాళ్ళకు ఉపాధినిస్తూ వారి కుటుంబాలకు సాయంగా ఉందామని ప్రతిన భూనినం. మాలాంటి వాళ్లందరికీ ఆదర్శంగా నిలుస్తాం. ప్రభుత్వం పెట్టిన ఈ స్కీము అవసరంలో ఉన్నవారు ఉపయోగించాలని, మంచి మనసుతో ఆలోచించిన వారందరూ ఎంతో మందికి స్ఫూర్తి అవ్వాలని కోరుకుంటున్నాం.

జై మహిళా సాధికారకత.
మీ
ఉపాధ్యాయ నాయకులు..

కాగా మహిళా టీచర్లు తీసుకున్న నిర్ణయానికి అందరూ అభినందిస్తూ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఈ ఫ్రీ సర్వీస్ కారణంగా ఇప్పటికే ఆర్టీసీ, పల్లెవెలుగు బస్సులన్నీ కిక్కిరిపోతున్నాయి. దీంతో కొన్ని సందర్భాల్లో పురుషులకు సీట్లు దొరకని పరిస్థితులు ఎదురుకావడంతో.. కొంతమంది దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మహిళలపై విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా, ప్రభుత్వానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఓ మంచి పనికి శ్రీకారం చుట్టి.. అందరికి ఆదర్శంగా నిలిచారు వెంకటాయపాలెంకు చెందిన మహిళా టీచర్లు. మరి, వారికీ ఫ్రీ సర్వీస్ వద్దంటూ.. ఆ మహిళలు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments