iDreamPost
android-app
ios-app

వీడియో: భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసిన భార్య! కారణం తెలిస్తే షాకే!

  • Published Aug 29, 2024 | 5:45 AM Updated Updated Aug 29, 2024 | 12:34 PM

Mahabubabad News: సాధారణంగా ఏ భార్య అయినా భర్త వేరే అమ్మాయిని చూస్తేనే తట్టుకోలేదు. ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకునేందుకు ఆయన భార్య ఒప్పుకున్నారు. ఆ భార్యకు ముద్దుల భర్త కాస్తా ఇద్దరు భార్యల ముద్దుల మొగుడయ్యారు. మరీ.. ఆ స్టోరీ ఏమిటంటే

Mahabubabad News: సాధారణంగా ఏ భార్య అయినా భర్త వేరే అమ్మాయిని చూస్తేనే తట్టుకోలేదు. ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకునేందుకు ఆయన భార్య ఒప్పుకున్నారు. ఆ భార్యకు ముద్దుల భర్త కాస్తా ఇద్దరు భార్యల ముద్దుల మొగుడయ్యారు. మరీ.. ఆ స్టోరీ ఏమిటంటే

  • Published Aug 29, 2024 | 5:45 AMUpdated Aug 29, 2024 | 12:34 PM
వీడియో: భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసిన భార్య! కారణం తెలిస్తే షాకే!

సాధారణంగా భర్త ఎలాంటి వాడైనా భార్య భరిస్తుంది. కానీ తనకు పంచాల్సిన ప్రేమ, ఆప్యాయతలను వేరే మహిళకు పంచితే మాత్రం తట్టులేదు. అంతేకాక సవతి బోరును ఏమాత్రం అంగీకరించలేదు. తన భర్త జీవితంలోకి మరో స్త్రీ రావడాన్ని ఏ భార్య సహించలేదు. అయితే ఓ మహిళ మాత్రం అందుకు భిన్నంగా చేసింది. తన భర్తకు దగ్గరుండు మరో యువతితో వివాహం జరిపించింది. పిల్లలు లేరా అనుకుంటే.. ఓ బాబు, పాప ఉన్నారు. అయినా కూడా తన భర్తకు రెండో పెళ్లి జరిపించింది. అయితే ఆమె అలా ఎందుకు చేసిందే తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపడక మానరు. ఈ ఘటన మహబుబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి

మహబూబాబాద్ జిల్లాకు చెందిన సురేష్, సరితలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నాడు. ఇదే సమయంలో సరిత భర్త సురేష్ ను సంధ్య అనే యువతి ఇష్టపడింది. సంధ్య మానసిక వికలాంగులు. సంధ్య తల్లిదండ్రులు ఇద్దరు కుమార్తెలు కాగా.. ఆమె రెండో కుమార్తె. మొదటి అమ్మాయికి ఇప్పటికే వివాహం జరిగింది. సురేష్ మేనమామ కుమార్తెనే సంధ్య. ఆ యువతి సురేష్ కి పెళ్లైన విషయం తెలిసి కూడా ఇష్టపడింది.

ఇక  సంధ్య మానసిక వికలాంగురాలు కావడంతో వేరే ఎవరికైనా ఇస్తే ఇబ్బందులు పడుతుందని కుటుంబ సభ్యులు ఆలోచించారు. ఈ క్రమంలో సురేష్ భార్య అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ..తన భర్తకే ఇచ్చి చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో భర్త సురేష్ కు దగ్గరుండి ఆ యువతితో వివాహం జరిపించింది. అనంతరం తన భర్త రెండో పెళ్లి విషయంపై మీడియా సరితను అడగ్గా..ఆమె మానవత హృదయంతో చేసుకున్నట్లు తెలిపింది. ఆ యువతి కూడా తమ బిడ్డల లాంటిదేనని, ఆమెకు భవిష్యత్ లో ఎలాంటి కష్టం రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సరిత తెలిపింది.

ఇక సురేష్, సంధ్యల వివాహం వేడుకలో పెళ్లి పీటల వద్ద సరిత స్వయంగా పనులు చూసుకుంది. అంతేకాక సురేష్..సంధ్య మెడలో తాళి కట్టే సమయంలో కూడా సరిత అక్కడనే ఉంది. మొత్తంగా సరిత దంపతులు చేసిన పనిపై స్థానికులు ప్రశంసిస్తున్నారు. గతంలోనూ శ్రీకాకుళంలో ప్రాంతంలో ఓ వ్యక్తికి..తన ఇద్దరు భార్యలు మూడో పెళ్లి చేసిన సంగతి తెలిసింది. తాజాగా ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాక సురేష్ సంధ్యల పెళ్లి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి.. ఈ  ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet