iDreamPost
android-app
ios-app

భార్య కొట్టిందని చెరువులో దూకిన భర్త! ఇలా అయితే మగాళ్లు బతికేదెలా?

  • Published Apr 18, 2024 | 8:52 PM Updated Updated Apr 18, 2024 | 8:52 PM

wife attack on husband.. పతియే ప్రత్యక్ష దైవం అంటారు. భర్త తిట్టినా కొట్టినా సరిపెట్టుకోమంటారు, మార్చుకోమంటారు. అలాగే భార్య కాస్త కోప్పడ్డా కూడా భర్త సర్దుకుపోతుంటేనే ఆ కాపురం కలకాలం చల్లగా ఉంటుంది. కానీ ఆ హింస ఎక్కువైతే..

wife attack on husband.. పతియే ప్రత్యక్ష దైవం అంటారు. భర్త తిట్టినా కొట్టినా సరిపెట్టుకోమంటారు, మార్చుకోమంటారు. అలాగే భార్య కాస్త కోప్పడ్డా కూడా భర్త సర్దుకుపోతుంటేనే ఆ కాపురం కలకాలం చల్లగా ఉంటుంది. కానీ ఆ హింస ఎక్కువైతే..

  • Published Apr 18, 2024 | 8:52 PMUpdated Apr 18, 2024 | 8:52 PM
భార్య కొట్టిందని చెరువులో దూకిన భర్త! ఇలా అయితే మగాళ్లు బతికేదెలా?

భార్యా భర్తల మధ్య గొడవలు, తగాదాలు, గిల్లి కజ్జాలు సహజం. ఒకరిపై ఒకరు తిట్టుకుంటారు.. కొట్టుకుంటారు. కోపం ఇంకా పీక్స్‌కు వెళితే.. చేతికి అందిన వస్తువులు విసురుకుంటారు. భర్త కోప్పడితే.. మగడు కొట్టాడని అలిగి కూర్చుంటుంది. వంట వార్పు మానేసి దీక్ష చేపడుతుంది. మరికొంత మందైతే.. పుట్టింటికి వెళ్లిపోతుంటారు. భర్త బతిమాలి ఇంటికి తీసుకెళ్లే వరకు పుట్టింట్లోనే తిష్ట వేస్తుంటారు. అదే భార్య కోప్పడితే..ఫుల్‌గా తాగి వచ్చి..మరింత రచ్చ చేయడమో, లేదా స్నేహితులకు చెప్పుకుని బాధపడటమో, లేక భార్యను బతిమాలుకోవడమే చేస్తుంటారు. కానీ ఈ భర్త మాత్రం.. నేను నా భార్యతో వేగలేకపోతున్నానంటూ ఆత్మహత్యకు యత్నించాడు.

భార్య కొడుతుందన్న ఆవేదనతో నాగేశ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. స్థానికులు చూసి రక్షించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కొంపల్లిలో చోటుచేసుకుంది. జయభేరి పార్క్ చెరవులోకి దిగి చనిపోయేందుకు ప్రయత్నించిన నాగేశ్‌ను స్థానికులు మాటల్లో పెట్టి.. పోలీసులకు సమాచారం అందించారు. చివరకు తాడు సాయంతో పోలీసులు అతడ్ని బయటకు తీసుకు వచ్చి ప్రశ్నించారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావని చెప్పగా.. ‘నా భార్య కొడుతుంది. నాకు వాతలు పెడుతోంది. పిల్లల్ని నా దగ్గరకు రానివ్వదు. నన్ను సరిగా చూసుకోదు. ఈ సమస్యకు పరిష్కారం లేక ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇదే సమయంలో షర్ట్ తీసి భార్య పెట్టిన వాతలు చూపించాడు. ‘పిల్లలకి నాన్న సచ్చిపోయాడు అని నేర్పిస్తుంది నా భార్య. దీనికి పరిష్కారం ఏందీ.. నేను చావాలా..? నేను చచ్చిపోమ్మంటే చస్తా’ అంటూ ఆవేదనతో చెప్పుకొచ్చాడు. దీనికి పరిష్కారం ఏంటనీ ప్రశ్నించగా.. నా భార్య నుండి విడాకులు ఇప్పించండి అని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.  భార్యలు ఇలా దాడి చేస్తే మగాళ్లు బతికేదెలా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులు అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి అతడి భార్యను పిలిపించినట్లు తెలుస్తోంది. భార్య కొడుతూ, తిడుతూ, వాతలు పెట్టడంతో తట్టుకున్నప్పటికీ.. పిల్లల్ని దూరం చేస్తుండటంతో వేదనతో భర్త.. ఇలా ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom