iDreamPost
android-app
ios-app

కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికి ఇస్తున్నారు? అర్హులు వీరే! లిస్ట్ లో మీ పేరు ఉందా?

  • Published Mar 13, 2024 | 4:23 PM Updated Updated Mar 13, 2024 | 4:23 PM

New Ration Card Approval: రాష్ట్రంలో ప్రతి పథకానికి రేషన్ కార్డు అనేతి ప్రామాణికం. కొత్త రేషన్ కార్డులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. నూతన రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.

New Ration Card Approval: రాష్ట్రంలో ప్రతి పథకానికి రేషన్ కార్డు అనేతి ప్రామాణికం. కొత్త రేషన్ కార్డులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. నూతన రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.

కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికి ఇస్తున్నారు? అర్హులు వీరే! లిస్ట్ లో మీ పేరు ఉందా?

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లింది కాంగ్రెస్ పార్టీ. ఈ పథకాలకు ఆకర్షితులైన తెలంగాణ ప్రజలు ఈసారి కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికి ఇస్తున్నారు? ఎవరు అర్హులు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నాం అని ప్రకటించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పథకాల అమలు విషయంపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంగళ వారం కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కేబినెట్ ఆమోదం ప్రకటించింది. ఆరు గ్యారెంటీ పథకాల కోసం అర్హులైన వారి నుంచి గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా గ్రామ, పట్టణ, వార్డు సభల్లో మహాలక్ష్మి, గృహ జ్యోతి, రైతు భరోసా, చేయూత పథకాలు, ఇందిరమ్మ ఇళ్లు పథకాల ద్వార లబ్ది పొందేందుకు ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించారు. అయితే ఈ పథకాల అమలుకు రేషన్ కార్డు ప్రమాణికం కనుక ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు పెట్టుకున్నారో వారందరికీ త్వరలో రేషన్ కార్డులు అందుతాయని శుభవార్త అందించారు. అభయ హస్తంలో పేర్కొన్న ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని… తెల్ల రేషన్ కార్డులపై కేబినెట్ లో చర్చించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ కాకపోవడం వల్ల చాలా మంది ఆరు గ్యారెంటీ పథకాలకు దూరమవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ అందించిన శుభవార్త విని సంతోషం వ్యక్తం చేస్తున్నాు. రాష్ట్రంలో ఇప్పటికీ 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా 20 లక్ష మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈసారి ఎవరికి పడితే వారికి కాకుండా.. అర్హులైన వారికే ఫుడ్ సేఫ్టీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటుంది. మొదట స్క్రూటినీ చేసిన తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టిన తర్వాత అర్హులని నిర్ధారించిన వారికే రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Revanth reddy about new ration card holders

తెల్ల రేషన్ కార్డు పొందడానికి గల అర్హతలు, ఎవరికి ఇస్తారు :

ఇటీవల ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సేకరించి వాటికి నెంబరింగ్ ఇస్తారు. ఆ వివరాలు సంబంధిత ఎమ్మార్వో లేదా అసిస్టెంట్ సివిల్ సప్లయ్ ఆఫీసర్ కు అందజేస్తారు. మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు. దరఖాస్తుదారుడు తెలంగాణకు చెందిన వాడై ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు అనర్హులు. సొంత కారు, బంగ్లా లాంటివి ఉండకూడదు, ఇన్‌కం ట్యాక్స్ చెల్లించేవారు అనర్హులు దారిద్యరేఖ దిగువన ఉన్నవారే అర్హులు. రేషన్ కార్డుల మంజూరు లో ఎక్కడ తేడా వచ్చినా వెరిఫికేషన్ అధికారిదే పూర్తి బాద్యత. వారే జవాబుదారి కనుక అన్ని సరైన ఆధారాలు, వివరాలు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తు దారుడి ఇంటిని విజిట్ చేసినట్లుగా సర్టిఫికెట్ లో తేది, సమయంతో పాటు సేకరించిన వివరాలు పొందుపరుస్తారు. దరఖాస్తుదారుడి ఆర్తిక స్థితిగతులు, జీవన విధానాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత.. అతడు/ఆమె రేషన్ కార్డుకు అర్హులా కాదా? అని నిర్ణయిస్తారు. దరఖాస్తుదారుడు అందించిన సమాచాంలో ఏదైనా బోగస్ అని తేలితే రేషన్ కార్డు మంజూరు ఆగిపోతుంది. అర్హులైన వారు ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు.. లేదా సంబంధిత అధికారులకు తమ వివరాలు అందించి సమాచారం తెలుసుకోవచ్చు.

రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ పథకాల కోసం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజా పాలన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో రేషన్ కార్డులకు అప్లై చేసుకోని వారు మరోసారి ప్రజా పాలన కార్యక్రమంలో అప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియ త్వరలో మొదలు కాబతున్నట్లు తెలుస్తుంది. అర్హులైన వారిక పేర్లను ఆన్ లైన్ లో ఉంచుతారని వార్తలు వస్తున్నాయి. ఆధార్ కార్డు, పాన్ కార్డు మాదిరిగానే రేషన్ కార్డు కీలకమైన డాక్యుమెంట్ అనే చెప్పాలి. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాల ప్రయోజనం పొందాలంటే రేషన్ కార్డు తప్పని సరి. ఒకవేళ రేషన్ కార్డు మంజురైతే అందులో వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తప్పులుంటే సంధింత కార్యాలయానికి వెళ్లి సరి చేసుకోవొచ్చని అంటున్నారు అధికారులు.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş