iDreamPost
android-app
ios-app

ఆడపిల్లకి ఇదేం దరిద్రపు అలవాటు.. అర్థరాత్రి ఇంటి బయట శబ్దాలు! లేచి చూస్తే షాక్!

  • Published May 16, 2024 | 10:28 AM Updated Updated May 16, 2024 | 10:28 AM

ఆడవాళ్లు అన్ని రంగాల్లో దూసుకుపోవాలంటే.. దాన్ని కొందరు మరోలా అర్థం చేసుకుని.. చెడు వ్యసనాల, మార్గాల్లో పయనిస్తున్నారు. తాజాగా ఓ మహిళ ఎంత నీచానికి పాల్పడింది అంటే..

ఆడవాళ్లు అన్ని రంగాల్లో దూసుకుపోవాలంటే.. దాన్ని కొందరు మరోలా అర్థం చేసుకుని.. చెడు వ్యసనాల, మార్గాల్లో పయనిస్తున్నారు. తాజాగా ఓ మహిళ ఎంత నీచానికి పాల్పడింది అంటే..

  • Published May 16, 2024 | 10:28 AMUpdated May 16, 2024 | 10:28 AM
ఆడపిల్లకి ఇదేం దరిద్రపు అలవాటు.. అర్థరాత్రి ఇంటి బయట శబ్దాలు! లేచి చూస్తే షాక్!

ఉద్యోగాలు, చదువులు వంటి కొన్ని రంగాల్లో ఆడామగా మధ్య అంతరాలు చాలా వరకు తగ్గాయి అని చెప్పవచ్చు. మంచి విషయాల్లో ఆడ, మగ అనే తేడా లేకుండా.. అందరికి సమాన అవకాశాలు లభించాలని అందరూ కోరుకుంటారు. అయితే నేటి కాలంలో మహిళలు.. మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారని సంతోషించాలో.. లేక మద్యాపానం, ధూమపానం, నేరాలు చేయడంలో కూడా మగవారితో పోటీ పడుతున్నందకు బాధపడాలో అర్థం కాని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చైన్‌ స్నాచింగ్‌లు, డ్రగ్స్‌ సరఫరాల, దొంగతనాలు వంటి నేరాల్లో మహిళలు కూడా భాగం కావడం బాధాకరం. ఈ క్రమంలో తాజాగా ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..

అసలే వేసవి కాలం.. నగరాల సంగతి ఏమో కానీ.. గ్రామాల్లో మాత్రం చాలా మంది ఆరుబయట, డాబా మీద పడుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. రోజంతా ఎండలో పని చేసి వచ్చి.. అలసిపోయి ఉంటారు. రాత్రి పూట గాఢ నిద్రలోకి జారుకుంటారు. దాదాపుగా గ్రామాల్లో 9 గంటల వరకే సుమారుగా అందరూ నిద్ర పోతారు. ఇక ఇదే సందుగా కొందరు దుండగులు తమ చేతి వాటం చూపుతారు. గ్రామాల్లో దొంగతనాలు అంటే.. కేవలం విలువైన ఆభరణాలు, నగదు మాత్రమే కాక.. జంతువులను కూడా వదలరు. దొడ్లలో కట్టి వేసి ఉంచిన బర్లు, ఆవులు, గొర్రెలను తరలించుకు వెళ్తారు. తాజాగా ఓ చోట ఇదే సంఘటన చోటు చేసుకుంది. బర్లను దొంగిలించడానికి ప్రయత్నించారు కొందరు దుండగులు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇలా బర్ల దొంగతానికి పాల్పడిన వారిలో ఓ మహిళ కూడా ఉండటం విశేషం.

ఈ సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా.. నర్సంపేట పరిధిలోని సర్వాపురంలో చోటు చేసుకుంది. గ్రామలోని 5వ వార్డులో నివాసం ఉండే వేముని స్వామి అనే వ్యక్తికి నాలుగు గేదెలున్నాయి. వాటిని రోజూ ఇంటి ముందు ఉన్నా జాగాలో కట్టేస్తుంటాడు. ఎప్పటిలానే మంగళవారం రాత్రి కూడా బర్రెలను ఇంటి ముందు కట్టేశాడు. ఈ విషయాన్ని గమనించిన నర్సంపేటకు చెందిన నలుగురు దుండగులు.. ఆ బర్రెలను దొంగతనంగా తోలుకెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే పల్లెటూరిలో.. జనాలు త్వరగా పడుకుంటారు. అర్ధరాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉంటారు. ఆ విషయాన్ని తమకు అనువుగా మార్చుకుని.. బర్లను తోలుకెళ్లాలని స్కేచ్‌ వేసుకున్నారు.

అనుకున్నట్లే అర్థరాత్రి తమ ప్లాన్‌ను అమలు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా బర్లను తోలుకెళ్దామని ప్రయత్నం చేశారు. కానీ వారి ప్లాన్‌ ఫెయిల్‌ అయ్యి.. బర్లు అరవడం ప్రారంభించాయి. దాంతో ఆరుబయట పడుకున్న వారు గేదెల అరుపులు విని.. నిద్ర నుంచి లేచి బయటకు వచ్చి చూశారు. ఎవరో నలుగురు వ్యక్తులు బర్రెలను తోలుకెళ్తున్నట్టు కనిపించింది. దీంతో కేకలు వేయడంతో.. ఇంటి యజమాని, అతడి బంధువులు లేచి వారి వెంటపడ్డారు.

దొంగతనానికి వచ్చిన వారిలో ముగ్గురు దొరకకుండా పారిపోగా.. ఓ మహిళ మాత్రం దొరికిపోయింది. అలా పట్టుకున్న మహిళను అదుపులోకి తీసుకొని స్తంభానికి కట్టేశారు. దేహశుద్ధి చేసిన తర్వాత.. అడిగితే అసలు వివరాలు చెప్పింది ఆ మహిళ. ఖానాపురం, కొత్తగూడ చుట్టుపక్క ప్రాంతాల నుంచి బర్రెలను దొంగతనంగా తోలుకొచ్చి.. కోసి అమ్ముతున్నట్లు ఒప్పుకుంది. దీంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆ మహిళను వాళ్లకు అప్పగించారు. గేదెల యజమాని ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.