P Krishna
Volunteer System in Telangana: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Volunteer System in Telangana: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
P Krishna
ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసే పథకాలు ప్రజలకు మరింత చేరువు అయ్యేలా వలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు. ఎంతోమంది నిరుద్యోగ యువతకు జీవన బృతి కల్పిస్తూ రూప కల్పన చేసిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శమని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏపీలో దాదాపు రెండు లక్షల మంది వాలంటెర్లుగా తమ సేవను అందిస్తున్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న వివిధ పథకాలు, సహాయాన్ని లబ్దిదారులకు ఇంటి వద్దకే అందించడం, అర్హత ఉన్న వారికి సంక్షేమ పథకాలు పొందేలా చేయడం ఇవన్నీ వాలంటీర్ల బాధ్యతలు. తాజాగా తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏపీలో అమల్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థ తెలంగాణలోనూ అమలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హూదాలో ఉన్న రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో వాలంటీర్ వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. సీఎం హూదాలో ఉన్న రేవంత్ రెడ్డి తాజాగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామాల్లో ‘ఇందిరమ్మ కమిటీ’ ఏర్పాటు చేస్తామని.. ఈ కమిటీల నుంచి చురుగ్గా ఉన్న కార్యకర్తలు, యువతను వాలంటీర్ గా ఎంపిక చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీలు క్రీయాశీల పాత్ర పోషించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్లు తెలిసింది. ప్రతి కమిటీ సభ్యుడికి ఆరు వేల రూపాయల వరకు గౌరవ వేతనం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
వాలంటీర్ వ్యవస్థ అంటే ఒక రకంగా సేవా కార్యక్రమం అన్నట్లే..కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులకు ప్రభుత్వం పథకాలు అందేలా చేయడం. తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం కోసం పనిచేయాలి.. ఇందుకోసం అధికారులతో సమన్యయం చేసుకోవాలి. లబ్దిదారులకు ఎంపిక.. సమస్యల పరిష్కారంలో వీరిదే కీలక పాత్ర. విద్య, ఆరోగ్య పరంగా తమ పరిధిలోని కుటుంబాలకు అవతాహన కల్పించాలి. రోడ్లు, వీధి దీపాలు, మురుగు నీటి కాల్వల పరిశుభ్రత, మంచినీటి ఇలా ప్రతి విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాలంటీర్లు చూసుకోవాలి. ఇది ఇక సమాజ సేవే అనవొచ్చు.
ప్రభుత్వం తరుపు నుంచి బాధ్యతలు తీసుకుంటారు కనుక కొంత గౌరవ వేతనం ఉంటుంది. ఏపీలో రూ. 5 వేలు ఇస్తున్నారు. తెలంగాణలో ‘ఇందిరమ్మ కమిటీ’ ద్వారా ఎంపికైన వాలంటీర్లకు రూ.6 వేల వరకు గౌరవ వేతనం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు గ్రామీణ స్థాయిలో ఇతర రంగాల్లో పనిచేసేవారు.. వాలంటీర్లుగా ఉంటూ అదనపు ఆదాయంగా కూడా పనికి వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి విధేయులుగా ఉంటూ.. పార్టీ పటిష్టతను కాపాడుతూ.. రాబోయే పార్ట మెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేసే కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుందని రేవంత్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణలో వాలంటీర్ వ్యస్థ రావడం గొప్ప శుభపరిణామం అని.. ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరూ లబ్దిపొందే అవకాశం ఉంటుందని అంటున్నారు.