iDreamPost
android-app
ios-app

TSRTC ఫ్రీ జర్నీ ఎఫెక్ట్.. మగవారి కోసం ప్రత్యేక బస్సులు!

  • Published Dec 27, 2023 | 9:36 AM Updated Updated Dec 27, 2023 | 11:13 AM

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దాంతో బస్సులన్ని కిక్కిరిసి పోతున్నాయి. దీనిపై మగవాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో.. టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆ వివరాలు..

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దాంతో బస్సులన్ని కిక్కిరిసి పోతున్నాయి. దీనిపై మగవాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో.. టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆ వివరాలు..

  • Published Dec 27, 2023 | 9:36 AMUpdated Dec 27, 2023 | 11:13 AM
TSRTC ఫ్రీ జర్నీ ఎఫెక్ట్.. మగవారి కోసం ప్రత్యేక బస్సులు!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేసింది. ఆ వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం ప్రారంభమైంది.  మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తోన్న ఉచిత ప్రయాణం పథకం కింద తెలంగాణలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కిడికైనా ఫ్రీగా ప్రయాణించొచ్చు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో జీరో టికెట్‌తో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.

ఈపథకానికి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజూ ప్రయాణం చేసే మహిళా ప్రయాణికులు 12-14 లక్షలు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 30 లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లలోనూ మహిళా ప్రయాణికులే కూర్చుంటున్నారు. దాంతో చాలా మంది మగవారు.. తమ కోసం ప్రత్యేక బస్సులు నడపాలని.. లేదంటే అదనపు సర్వీసులైనా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పలువురు.. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ, మగవారికి సీట్లు లేకపోవడం వంటి ఘటనలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ గోడు పట్టించుకోవాలని ఆర్టీసీ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకోనుందని వార్తలు వస్తున్నాయి. బస్సుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని.. అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ ఆలోచన చేస్తోన్నట్లు తెలుస్తుంది. వృద్ధుల(పురుషులు)కు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపైనా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఉచిత ప్రయాణం వల్ల విద్యార్థులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వారి కోసం కొన్ని మార్గాల్లో మరీన్ని సర్వీసులు నడిపే విషయంపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారట. అలానే సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది. సమయాల వారీగా రద్దీపై సమగ్ర సమాచారం వచ్చాక పురుషులకు, విద్యార్థులకు స్పెషల్ బస్సులు నడపడంపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఒకవేళ పురుషులకు స్పెషల్ బస్సులు సాధ్యం కాకుంటే..  మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడపడం అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. జీరో టికెట్‌ అని మహిళా ప్రయాణికుల్ని చిన్నచూపు చూడటం సరికాదని.. వారి తరఫున ప్రభుత్వం ఆ ఛార్జీ చెల్లిస్తోందని ఆర్టీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పలురకాల ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టామని చెప్పారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి స్పెషల్ బస్సులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరి మగవారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలా.. వద్దా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis