iDreamPost
android-app
ios-app

TSRTC బంపర్ ఆఫర్! బస్సు ఎక్కితే రూ.11 లక్షలు గెలుచుకునే ఛాన్స్!

  • Published Oct 10, 2023 | 5:23 PM Updated Updated Oct 10, 2023 | 5:52 PM
  • Published Oct 10, 2023 | 5:23 PMUpdated Oct 10, 2023 | 5:52 PM
TSRTC బంపర్ ఆఫర్! బస్సు ఎక్కితే  రూ.11 లక్షలు గెలుచుకునే ఛాన్స్!

రానున్న బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)ఇప్పటికే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు కొన్ని ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే దసరా పండగకి సొంతూళ్లకు వెళ్లే వారికి దసరా ధమాకా పేరుతో ఓ లక్కీ డ్రాను తీసుకొచ్చింది. ఇందులో పాల్గొంటే విలువైన నగదు బహుమతులు పొందొచ్చని TSRTC తెలిపింది. అది ఎలా అనేది తెలుసుకోవాలనుందా?

ఈ నెల 24న దసరా పండగా నేపథ్యంలో నగరాల్లో ఉండే వారంతా సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు TSRTC దసరా ధమాకా పేరుతో ఓ లక్కీ డ్రాను ముందుకు తీసుకొచ్చింది. ఇందులో పాల్గొనేవారు రూ.11 లక్షల నగదు బహుమతులు పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అది ఎలా అంటే? మనం టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు ముందుకుగా టికెట్ తీసుకుంటాం.

ఇక ప్రయాణం పూర్తయ్యాక ఆ టికెట్ వెనకాల మన పూర్తి వివరాలు రాసి బస్ స్టాండ్లలలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లో వేయాలి. వాటిని లక్కీ డ్రాలో తీసి విజేతలను ప్రకటిస్తారు. మొత్తం 110 మందిని ప్రకటించి గెలుపొందిన వారిని ఘనంగా సన్మానిస్తారు. ఇంతే కాకుండా రూ.9990 చొప్పున నగదు బహుమతి కూడా ఇవ్వనున్నట్లు TSRTC తెలిపింది. ఈ నెల 21 నుంచి 23 తేది వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. ఆగస్టు 30 న రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ లక్కీ డ్రా నిర్వహించిన విషయం తెలిసిందే.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet giriş