తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూనే ఉంది. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయలు తీసుకుని ప్రయాణికులపై భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ లకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ పాస్ సౌకర్యాన్ని మెుదట కొన్ని జిల్లాల్లో ప్రారంభించి.. ఆ తర్వాత రాష్ట్రం మెుత్తం అమలు చేయాలని భావిస్తోంది. ఈ పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
TSRTC.. ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూనే ఉంటోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ. కొత్తగా పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. మెుదట రాష్ట్రంలోని కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ లోని బస్ భవన్ లో ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ పోస్టర్లను సోమవారం సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆ విష్కరించారు. ఈ టౌన్ పాస్ లు ఈనెల 18 నుంచి అందుబాటులోకి వస్తుందని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
ఈ టౌన్ పాస్ లో ప్రయాణికులు మహబూబ్ నగర్, కరీంనగర్ లో 10 కిలో మీటర్లు, నల్లగొండ, నిజామాబాద్ లో 5 కిలో మీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయెుచ్చు. 10 కిలో మీటర్లకు నెలకు రూ. 800 కాగా.. ఈ పాస్ వాస్తవానికి రూ.1200 ఉండగా.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించడానికి సంస్థ రాయితీ కల్పించింది. అలాగే 5 కిలో మీటర్లకు రూ.500 ఉంది. వాస్తవానికి ఈ పాస్ రూ. 800 ఉండేది కానీ రాయితీ కింద సంస్థ దీని ధరను రూ. 500గా నిర్ణయించింది. కాగా.. ఇప్పటికే వరంగల్, హైదరాబాద్ లో జనరల్ పాస్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలాగే ప్రయాణికులు ఈ టౌన్ పాస్ ను ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.
ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”కు #TSRTC శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది.
ఈ టౌన్… pic.twitter.com/FxqcxdpFKi
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) July 17, 2023
ఇదికూడా చదవండి: ప్రేమలో విఫలమవుతున్నారా? అయితే.. లవర్‌ను అద్దెకు తీసుకోండి!