iDreamPost
android-app
ios-app

ఇలా అయితే ఎలా? ఒక్క బైక్ పై ఇంతమందా!? సజ్జనార్ ఎమోషనల్ ట్వీట్

  • Published Apr 24, 2024 | 3:18 PM Updated Updated Apr 24, 2024 | 3:18 PM

Sajjanar Emotional Tweet: దేశంలో ప్రతి రోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు చేసే తప్పులు, డ్రైవర్ల నిర్లక్ష్యం ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

Sajjanar Emotional Tweet: దేశంలో ప్రతి రోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు చేసే తప్పులు, డ్రైవర్ల నిర్లక్ష్యం ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇలా అయితే ఎలా? ఒక్క బైక్ పై ఇంతమందా!? సజ్జనార్ ఎమోషనల్ ట్వీట్

ఈ మధ్య కాలంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.వాహనదారులు చేస్తున్న నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ నియమాలు అమలు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తూ మందుబాబులకు షాక్ ఇస్తున్నారు.   ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధిస్తున్నారు. ఇన్ని చేస్తున్నా కొంతమంది వాహనదారులు మాత్రం తమ పద్దతి మార్చుకోకుండా ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఒక్క బైక్ పై ఏడుగురు ప్రయాణిస్తున్న ఫోటోని షేర్ చేస్తూ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎమోషనల్ ట్విట్ చేశారు.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కరలేదు. పోలీస్ బాస్ గా ఉన్నపుడు నేరస్థుల గుండెల్లో నిద్రపోయేవారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో రకాల స్కీమ్స్ అమలు చేస్తూ ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటున్నారు సజ్జనార్. అంతేకాదు ఎప్పటికప్పుడు ఆర్టీసీ నిర్ణయాలు ప్రజలకు తెలియజేస్తూ ప్రయాణికులను అలర్ట్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల విషయంలో తగు జాగ్రత్తలు, సూచనలు అందిస్తున్నారు. తాజాగా ఓ వాహనదారుడు చేసిన ఘనకార్యం గురించి స్పందిస్తూ.. భావోద్వేగంతో ట్విట్ చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయట తిరగడం చాలా డేంజర్ అని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ క్రమంలోనే ‘ఏడుగురితో ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం!’ అంటూ ఓ పత్రికలో ప్రచురితమైన వార్తకు సంబంధించిన క్లీప్ ని జత చేస్తూ ఎంతో ఎమోషన్ గా ట్విట్ చేశారు. మండుటెండలో ఒక్క బైక్ పై ఇంతమందా? ‘ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన ఇలాంటి బైక్ ప్రయాణం శ్రేయస్కరం కాదు. చిన్నారుల ప్రాణాల విషయంలో కొంతమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతో బాధాకరం. ఇలాంటి నిర్లక్ష్యం వల్లనే నిత్యం ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరగుతూనే ఉన్నాయి’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. సజ్జనార్ ట్వీట్ చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి వాళ్లను ట్రాఫిక్ సిబ్బంది పట్టుకొని భారీ జరిమానా విధిస్తే మరోసారి చేయరు అంటూ కొంతమంద కామెంట్స్ చేస్తే.. ఇలాంటి ఫోటోలు చూపించి అవగాహన సదస్సు వాహనదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి క్లాస్ తీసుకోవాలని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.