iDreamPost
android-app
ios-app

Uttam Kumar Reddy: అప్పటి నుంచే రూ.500 కే గ్యాస్.. మంత్రి ఉత్తమ్ కుమార్ క్లారిటీ

  • Published Dec 12, 2023 | 2:13 PM Updated Updated Dec 12, 2023 | 3:16 PM

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైనా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై స్పష్టత ఇచ్చారు. ఆ వివరాలు..

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైనా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై స్పష్టత ఇచ్చారు. ఆ వివరాలు..

  • Published Dec 12, 2023 | 2:13 PMUpdated Dec 12, 2023 | 3:16 PM
Uttam Kumar Reddy: అప్పటి నుంచే రూ.500 కే గ్యాస్.. మంత్రి ఉత్తమ్ కుమార్ క్లారిటీ

తెలంగాణ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు ప్రకటించి.. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే.. బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. మహాలక్ష్మి పథకంలో భాగమైన మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, చేయూత, ఆరోగ్య శ్రీ పెంపు వంటి పథకాలను ప్రారంభించగా.. రైతు భరోసా నిధులు కూడా విడుదల చేసింది. ఇక జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మరో హామీ.. రూ.500 కే గ్యాస్ సిలిండర్. ఈ పథకం అమల్లోకి వచ్చిందంటూ వార్తలు రావడంతో..  ఇప్పటికే చాలా చోట్ల ప్రజలు గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కట్టారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూ.500 కే గ్యాస్ అమలు తేదీపై క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మరో రెండు గ్యారెంటీలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌, వరికి రూ.500 బోనస్‌ హామీలను రానున్న వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. మంగళవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర సివిల్‌ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, వరికి రూ.500 బోనస్‌ మరో వంద రోజుల్లో అమలు చేస్తాం అని తెలిపారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..”సివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. గత ప్రభుత్వం సివిల్‌ సప్లై శాఖకు ఆర్థిక సహాయం చేయక పోవడంతో 56 వేల కోట్లు అప్పు చేసింది. రూ.11 వేల కోట్ల నష్టాల్లో శాఖ కూరుకుపోయింది. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక లోపాలున్నాయి. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు” అన్నారు.

gas in telangana

“ప్రస్తుతం ప్రజలకు ఇచ్చే బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తోంది. రాష్ట్రం ఇచ్చేది కిలో బియ్యం మాత్రమే. దీని క్వాలిటీ పెరగాలి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ మనిషికి కేవలం ఒక్క కిలో బియ్యాన్ని మాత్రమే ఇచ్చింది. రాష్ట్రంలో బియ్యం తీసుకునే లబ్ధిదారులు 2కోట్ల 80 లక్షల మంది ఉన్నారు. ప్రజలకు ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని వారు ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది గమనించాలి” అన్నారు.

“కిలో 39 రూపాయలు పెట్టి మనం బియ్యం సేకరించి.. వాటిని ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం. అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుంది. బియ్యం పంపిణీని మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా తీసుకుని.. లోపాలు ఎక్కడ ఉన్నాయో చూడాలి. బియ్యం లబ్దిదారులను ర్యాండమ్‌ చెక్ చెయ్యాలి. ప్రజల నుంచి సమాచారం సేకరించాలి” అని ఉత్తమ్‌ అధికారులకు సూచించారు.

“ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల్లో బియ్యం తీసుకున్న వారు 89 శాతం దాటడడం లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తాం. అలానే వడ్ల కొనుగోలుకు సివిల్‌ సప్లై శాఖ అన్ని చర్యలు తీసుకోవాలి. రైతులకు డబ్బు వెంటనే అందాలి” అని ఉత్తమ్‌ తెలిపారు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş