బాబూ మోహన్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం.. ఒక్క దెబ్బతో ఎన్నికలకు దూరం

TS Elections 2024: తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బాబు మోహన్‌కి ఈసీ షాకిచ్చింది. ఆయన ఎన్నికల్లో పోటీకి అనర్హుడని తేల్చింది. ఆ వివరాలు..

TS Elections 2024: తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బాబు మోహన్‌కి ఈసీ షాకిచ్చింది. ఆయన ఎన్నికల్లో పోటీకి అనర్హుడని తేల్చింది. ఆ వివరాలు..

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దశల్లో పలు రాష్ట్రాల్లో పోలింగ్‌ పూర్తి కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్‌ జరగనుంది. వచ్చే నెల అనగా మే 13 న రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇక ఎలక్షన్‌లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆయా నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలిన ప్రక్రియ కూడా శుక్రవారం నాడు ముగిసింది. ఇక ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలో మాత్రం లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని మెుత్తం 17 స్థానాలకు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కలిపి 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలిన ప్రక్రియ ముగియా.. మొత్తం నామినేషన్లు వేసిన వారిలో 267 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను వివిధ కారణాలతో తిరిస్కరించారు. 626 మంది నామినేషన్ పేపర్లు నిబంధనల మేరకు ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో అధికారులు ఈ స్క్రూట్నీ ప్రక్రియను నిర్వహించారు. ఈ క్రమంలో వరంగల్ స్థానం నుంచి చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి బాబూ మోహన్ నామినేషన్‌ను అధికారులు రిజెక్ట్ చేశారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా బాబు మోహన్‌.. వరంగల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా.. అధికారులు తిరస్కరించారు. 10 మంది ప్రతిపాదకుల పేర్లు ప్రస్తావించినప్పటికీ బాబు మోహన్‌ నామినేషన్‌లో ఎవరూ సంతకాలు చేయకపోవడం.. అఫిడవిట్‌లో నిర్దిష్ట ఖాళీలు ఉన్నాయని ఆర్వో వెల్లడించారు. ఈ కారణాలతో ఆయన నామినేషన్‌ను రిజెక్ట్ చేసారు. అలానే నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడికి బీజేపీ టికెట్‌ కేటాయించగా.. రాములు డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీఫాం లేకపోవడంతో ఆయన నామినేషన్‌ను ఎన్నికల​ అధికారులు రిజెక్ట్ చేసారు.

ఇక ఇదే నియోజకవర్గంలో మాజీ ఎంపీ మందా జగన్నాథం వేసిన నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది. ఆయన బీఎస్పీ నుంచి నామినేషన్ వేసినా.. బీఫాం లేకపోవటంతో అధికారులు తిరసక్కరించారు. అక్కడ మరో అభ్యర్థి బీఎస్పీ బీఫాంను సమర్పించారు. స్క్రూట్నీలో తిరస్కరణకు గురైన నామినేషన్లలో అత్యధికంగా మల్కాజిగిరి నుంచి 77 ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ నుంచి 25, కరీంనగర్‌ 20, హైదరాబాద్‌ 19, చేవెళ్ల 17, పెద్దపల్లి, జహీరాబాద్‌లలో 14 చొప్పున, నాగర్‌కర్నూల్‌ 13, సికింద్రాబాద్‌ 11, నిజామాబాద్‌, భువనగిరి, వరంగల్‌, ఆదిలాబాద్‌లలో 10 చొప్పున, మహబూబ్‌నగర్‌లో 7, మహబూబాబాద్‌లో 5, ఖమ్మంలో 4, మెదక్‌లో ఒకరి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.

Show comments