iDreamPost
android-app
ios-app

BRSకి మద్దతు తెలిపిన యాంకర్‌ శ్రీముఖి.. కారణం అదేనంట

  • Published Nov 08, 2023 | 2:14 PM Updated Updated Nov 08, 2023 | 2:17 PM

ఎప్పుడు షూటింగ్‌లు, ఫొటో షూట్లంటూ బిజీగా ఉండే శ్రీముఖి.. తొలిసారి తన సోషల్‌ మీడియాలో ఒక స్పెషల్‌ వీడియోని షేర్‌ చేసింది. ప్రస్తుతం అది వైరలవుతోంది. ఆ వివరాలు..

ఎప్పుడు షూటింగ్‌లు, ఫొటో షూట్లంటూ బిజీగా ఉండే శ్రీముఖి.. తొలిసారి తన సోషల్‌ మీడియాలో ఒక స్పెషల్‌ వీడియోని షేర్‌ చేసింది. ప్రస్తుతం అది వైరలవుతోంది. ఆ వివరాలు..

  • Published Nov 08, 2023 | 2:14 PMUpdated Nov 08, 2023 | 2:17 PM
BRSకి మద్దతు తెలిపిన యాంకర్‌ శ్రీముఖి.. కారణం అదేనంట

శ్రీముఖి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. నటిగా ఎంట్రీ ఇచ్చింది. ప్రారంభంలో చిన్నా, చితకా పాత్రాల్లో కనిపించింది. ఆ తర్వాత బుల్లి తెర మీద యాంకర్‌గా చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో సినిమాల్లో చేసిన రాని గుర్తింపు.. యాంకర్‌గా వచ్చింది. బుల్లితెర మీద ఎంతో సందడి చేస్తూ.. చలాకీగా మాట్లాడుతూ.. షోలను రక్తి కట్టిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ యాంకర్‌గా దూసుకుపోతుంది శ్రీముఖి. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి కూడా వెళ్లింది. ఇక సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది శ్రీముఖి. తాజాగా ఓ ఆసక్తికర వీడియోని షేర్‌ చేసింది శ్రీముఖి. తాను బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నట్లు ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. అందుకు గల కారణాలు కూడా వివరించింది. ప్రస్తుతం ఇది వైరవలవుతోంది. ఆ వివరాలు..

ఫొటో షూట్స్‌, రీల్స్‌ చేస్తూ సందడిగా ఉండే శ్రీముఖి.. తొలిసారి ఒక స్పెషల్‌ వీడియోతో తన అభిమానుల ముందుకు వచ్చింది. ఎన్నికల సమయంలో ఆమె కూడా పొలిటికల్‌ అంశాల గురించి మాట్లాడిన వీడియోనే షేర్‌ చేసింది. దీనిలో తాను బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తున్నానని.. ఆపార్టీలో చేరుతున్నట్లు చెప్పుకొచ్చింది శ్రీముఖి. అంతేకాక తాను ఎందుకు బీఆర్‌ఎస్‌లో చేరుతుందో కూడా వివరించింది శ్రీముఖి. కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాల వల్ల.. తాను బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ ‘‘మాది నిజామాబాద్‌ జిల్లా అని మీ అందరికీ తెలుసు. మా ఊరు పదేళ్ళ క్రితం ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉంది.. అని పోల్చి చూసి నేను షాక్‌కు గురయ్యాను. ఎంతో ఆశ్చర్యం వేసింది కూడా. ఈ పదేళ్ళలో మా ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టు గుర్తించాను. చాలా మార్పులు కూడా వచ్చాయి. వాటి గురించి మీకు చెప్పడానికి ఇప్పుడిలా మీ ముందుకు వచ్చాను. మా ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎంతో అధునాతనంగా తీర్చిదిద్దారు. వాటర్‌ ట్యాంక్స్‌ను పునరుద్ధరించారు. ఇంకా రోడ్లు, బ్రిడ్జ్‌లు, ఆస్పత్రులు, డ్రైనేజ్‌ వ్యవస్థ.. ఇలా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు’’ అని చెప్పుకొచ్చింది.

అంతేకాక ‘‘ఒక్క నిజామాబాద్‌లోనే కాదు, తెలంగాణ మొత్తం ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. అందుకే మళ్ళీ ఇదే గవర్నమెంట్‌ వస్తే మన భవిష్యత్తు ఇంకా బాగుంటుంది అని నాకు అనిపించింది. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఓటు వెయ్యండి’’ అని కోరింది శ్రీముఖి. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. చాలా మంది శ్రీముఖి మాటలతో ఏకీభవిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler