iDreamPost
android-app
ios-app

టీఎస్ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల

టీఎస్ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల

తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తీపి కబురు అందించింది. టీఎస్ఎల్పీఆర్బీ తాజాగా కానిస్టేబుల్ తుది ఫలితాలను విడుదల చేసింది. 15,750పోస్టులకు అర్హులైన అభ్యర్థులను పోలీస్ నియామక మండలి ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు రేపు(గురువారం) ఉదయం నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది.

కాగా కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసేందుకు గతేడాది నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ పోలీస్, సివిల్ పోలీస్, ఏఆర్ తదితర విభాగాల్లో భర్తీ ప్రక్రయిను చేపట్టారు. రాష్ట్రంలో నేరాలను అదుపు చేసి, శాంతి భద్రతలను కాపాడే దిశగా ఆలోచించిన ప్రభుత్వం పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేసింది.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabet