iDreamPost
android-app
ios-app

ప్రేమ వివాహం.. పాపం, పెళ్లై ఏడేళ్లు గడుస్తున్నా..!

  • Published Jul 17, 2023 | 5:43 PM Updated Updated Jul 17, 2023 | 5:43 PM
  • Published Jul 17, 2023 | 5:43 PMUpdated Jul 17, 2023 | 5:43 PM
ప్రేమ వివాహం.. పాపం, పెళ్లై ఏడేళ్లు గడుస్తున్నా..!

మెదక్ జిల్లాలోని అహ్మద్ నగర్ లో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక భర్త స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అలా వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా సంతోషంగా కాపురాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కానీ, ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుస్తున్న వీరి కోరిక మాత్రం నెరవేరలేదు. దీంతో అనేక ప్రయత్నాలు చేశారు. పాపం, చివరికి నిరాశే ఎదురైంది. అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని అహ్మద్ నగర్ లో నీరుడి లక్ష్మణ్-రాణి దంపతలు నివాసం ఉంటున్నారు. వీళ్లు ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ దంపతులు ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా సంతోషంగా గడుపుతూ వచ్చారు. అలా ఏడేళ్లు గడిచింది. కానీ, పెళ్లై ఇన్నేళ్లు గడుస్తున్నా వీరికి ఇంకా సంతానం కలగలేదు. దీని కోసం ఈ దంపతులు అనేక ఆస్పత్రుల చుట్టు తిరిగారు. ఇదే కాకుండా కనిపించిన దేవుడిని సైతం మొక్కారు. కానీ, వీరికి పిల్లలు మాత్రం కలగలేదు. దీనికి తోడు చేసిన అప్పులు కూడా ఎక్కువయ్యాయి. వీటన్నిటినీ చూసిన ఈ దంపతులు మానసికంగా కృంగిపోయారు.

ఇక చేసేదేం లేక ఈ దంపతులు ఈ నెల 8న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరి కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ఫలితం లేకపోవడంతో చికిత్స పొందుతూ రాణి ఆదివారం రాత్రి మరణించగా, సోమవారం తెల్లవారు జామున లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఇది కూడా చదవండి: చనిపోయిన పెంపుడు కుక్కు.. సమాధి కట్టి పెద్దకర్మ చేసిన యజమాని

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom