iDreamPost
android-app
ios-app

భార్య చితిమంటలు ఆరకముందే భర్త మృతి! కన్నీరు తెప్పిస్తున్న విషాద ఘటన!

  • Published Oct 28, 2023 | 6:11 PM Updated Updated Oct 28, 2023 | 6:11 PM

ఈ భార్యాభర్తలు రెండు రోజుల వ్యవధిలోనే మృతి చెందారు. కన్నవాళ్లు దూరం అవ్వడంతో వారి పిల్లలు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇతర కుటుంబ సభ్యులు కూడా గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

ఈ భార్యాభర్తలు రెండు రోజుల వ్యవధిలోనే మృతి చెందారు. కన్నవాళ్లు దూరం అవ్వడంతో వారి పిల్లలు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇతర కుటుంబ సభ్యులు కూడా గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

  • Published Oct 28, 2023 | 6:11 PMUpdated Oct 28, 2023 | 6:11 PM
భార్య చితిమంటలు ఆరకముందే భర్త మృతి! కన్నీరు తెప్పిస్తున్న విషాద ఘటన!

ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భార్యాభర్తలు రెండు రోజుల వ్యవధిలోనే మృతి చెందారు. కన్నవాళ్లు దూరం అవ్వడంతో వారి పిల్లలు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇతర కుటుంబ సభ్యులు కూడా గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇంతకు ఈ దంపతులు ఎలా చనిపోయారు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే? కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సాయిపేట పరిధిలోని తూర్పు తండాలో రవి, సోనియా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా గడిపారు.

ఇదిలా ఉంటే.. ఈ దంపతులు బుధవారం ఓ పని మీద బైక్ పై బయలుదేరగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక భర్త తీవ్రంగా గాయపడడంతో అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రవి చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో వారి పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరి ఇతర కుటుంబ సభ్యులు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు. దీంతో వీరి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదానికి గురై రెండు రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయిన ఈ దంపతుల విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş