iDreamPost
android-app
ios-app

అందమైన రూపం, సాఫ్ట్ వేర్ ఉద్యోగం. కానీ.., పెళ్ళైన కొన్ని రోజులకే!

  • Published May 29, 2024 | 5:49 PM Updated Updated May 29, 2024 | 5:49 PM

Wyra crime News: ఎంతో అందమైన భవిష్యత్ ఉన్న కొంతమంది చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకోలేక జీవితంలో దారుణమైన నిర్ణయాలు తీసుకొని కుటుంబ సభ్యులను కంటతడి పెట్టిస్తున్నారు.

Wyra crime News: ఎంతో అందమైన భవిష్యత్ ఉన్న కొంతమంది చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకోలేక జీవితంలో దారుణమైన నిర్ణయాలు తీసుకొని కుటుంబ సభ్యులను కంటతడి పెట్టిస్తున్నారు.

  • Published May 29, 2024 | 5:49 PMUpdated May 29, 2024 | 5:49 PM
అందమైన రూపం, సాఫ్ట్ వేర్ ఉద్యోగం. కానీ.., పెళ్ళైన కొన్ని రోజులకే!

ఇటీవల కొంతమంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షనికావేశంలో ఎదుటివారిపై దాడులు చేయడం.. ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు.క్షనికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండుకుంటుంది. ఈ మధ్యనే పెళ్లైంది.. భర్తకు అమెరికాలో మంచి ఉద్యోగం.. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం. బంగారం లాంటి భవిష్యత్ ఉన్న ఓ వివాహిత చేసిన పని ఇప్పుడు ఇరు కుటుంబాలు షాక్ లో ఉన్నాయి. ఇంతకీ ఆ వివాహిత ఏం చేసింది.. కుటుంబ సభ్యులు ఎందుకు షాక్ లో మునిగిపోయారు అన్న విషయం గురించి తెలుసుకుందాం.. పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరా మండలం నారపునేనిపల్లిలో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దావూలూరి కిరణ్ కుమార్ – ప్రసన్న దంపతుల మొదటి కూతురు వర్షిత (23) అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఏపీకి చెందిన బండి గోపీతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఈడూ జోడు ఎంతో బాగుందని బంధు మిత్రులు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. భర్త అమెరికాలో ఉద్యోగం, ఆమెకు సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం ఎంతో అందమైన జీవితం అని తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు. కానీ వారి అనందం ఎంతో కాలం నిలవలేదు.. వర్షిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. పెళ్లైన సంతోషం కూడా లేకుండా అప్పుడే నీకు నిండు నూరేళ్లు నిండాయా తల్లీ అంటూ కన్నీరు మున్నీరయ్యారు.

వైరా మండలం నాగపునేనిపల్లి గ్రామానికి చెందిన వర్షిత్ అలియాస్ వందనకు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన బండి గోపీతో పెళ్లి జరిగింది. ప్రస్తుతం బండి గోపి అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. పెళ్లైన నాలుగు రోజులకే గోపీ అమెరికా వెళ్లిపోయాడు.. వర్షితకు హైదరాబాద్ టెక్ మహేంద్ర కంపెనీలో జాబ్ వచ్చింది. వర్షిత గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో చికిత్స చేయించి ఇంటికి తీసుకు వచ్చారు. సోమవారం రాత్రం వర్షితకు కడుపు నొప్పి తీవ్రం కావడంతో భరించలేక ఎవరికీ చెప్పుకోలేక.. ఇంటి ఆవరణలో ఉన్న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం లేచి వర్షిత రూమ్ లో లేదని ఆమెను వెతుకుతున్న సందర్భంలో బావి చెక్కలు జరిపి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానినికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio