iDreamPost
android-app
ios-app

అన్నావదినను రోడ్డుపై కట్టేసిన తమ్ముడు! కారణం తెలిస్తే.. షాకే..!

Siddipet News: నేటికాలంలో మానవ సంబంధాలు మొత్తం ఆర్థిక విషయాలపై ఆధారపడి ఉన్నాయి. డబ్బుల కంటే.. ఏవి ఎక్కువ కాదన్నట్లు కొందరి తీరు ఉంది. తాజాగా ఓ వ్యక్తి తన సొంత అన్నా వదినను రోడ్డుపై కట్టేశాడు.

Siddipet News: నేటికాలంలో మానవ సంబంధాలు మొత్తం ఆర్థిక విషయాలపై ఆధారపడి ఉన్నాయి. డబ్బుల కంటే.. ఏవి ఎక్కువ కాదన్నట్లు కొందరి తీరు ఉంది. తాజాగా ఓ వ్యక్తి తన సొంత అన్నా వదినను రోడ్డుపై కట్టేశాడు.

అన్నావదినను రోడ్డుపై కట్టేసిన తమ్ముడు! కారణం తెలిస్తే.. షాకే..!

భారత దేశంలో కుటుంబ వ్యవస్థకు ఎంతో విలువ ఉంది. ముఖ్యంగా అన్నాదమ్ములు, అక్కాచెళ్లల మధ్య ఉండే ప్రేమాను బంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు తోడబుట్టిన వారు ఇబ్బందుల్లో ఉంటే.. తమ కష్టాలుగా భావించి సాయం చేసేవారు. నేటి కాలంలో అందుకు భిన్నంగా రక్త సంబంధాల కంటే.. ఆర్థిక విషయాలకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఈ క్రమంలో సొంత వారిపై దాడిచేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఓ వ్యక్తి..తన సొంత అన్నా, వదినను నడి రోడ్డుపై కట్టేశాడు. ఇక ఎందుకు అలా చేశాడు, ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

సిద్దిపేట లోని కేసీఆర్ నగర్ లో దొంతరబోయిన పర్శరాములు,తార అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఏడో తరగతి చదివే కుమార్తె ఉంది. పర్శరాములు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతడికి దొంతరబోయిన కనకయ్య అనే తమ్ముడు ఉన్నాడు. అతడు నాసర్ పూర్ లో నివాసం ఉంటున్నాడు. అవసరాల నిమిత్తం తన తమ్ముడైన కనకయ్య వద్ద 8 నెలల క్రితం రూ.1.20 లక్షలు అప్పు తీసుకున్నాడు. నాలుగు నెలల క్రితం లక్ష రూపాయలు తిరిగి  చెల్లించాడు. మిగిలిన డబ్బులు చెల్లించాల్సి ఉంది.

ఈ క్రమంలోనే శుక్రవారం కౌన్సిలర్ కనకరాజు..పర్శరాములుకు ఫోన్ చేసి డబ్బుల వివాదంపై మాట్లాడేందుకు రమ్మన్నాడు. దీంతో  పర్శరాములు తన భార్య తారతో కలిసి నాసర్ పూర్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే అన్నాదమ్ముల మధ్య మరోసారి గొడవ జరగింది. దీంతో కనకరాజు ఆగ్రహం వ్యక్తం చేసి..వారిద్దరిని బయటకు పంపించారు. ఇవ్వాల్సిన రూ.20 వేలు, దానికి సంబంధించిన వడ్డీ డబ్బులు చెల్లించాలని తమ్ముడు కనకయ్య, అతడి భార్య భాగ్య, వారి కుమారుడు భాను.. పర్శరాముల దంపతులతో వాగ్వాదం పెట్టుకున్నారు. అనంతరం పర్శరాముల దంపతులను కొట్టి నాసర్ పూర్ హనుమాన్ ఆలయం  ప్రాంగంలోని రావిచెట్టు వద్ద ఉన్న గ్రిల్స్ కు తాడుతో కట్టేశారు. చాలా సేపు వారు అలానే రోడ్డుపై ఉండిపోయారు.  ఈ క్రమంలోనే స్థానికులు కల్పించుకుని  వారిని విడిపించారు.

అనంతరం బాధితులు సిద్ధిపేట వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనకయ్య దంపతులు, వారి కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక పొలం, డబ్బులు వంటి విషయాల్లో అన్నాదమ్ముళ్లు బద్ద శత్రువుల్లా మారిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే.. భూముల కోసం  ప్రాణాలను సైతం తీసేందుకు వెనుకాడటం లేదు.  ఇప్పటికే ఆర్థిక వ్యహారాల్లో చాలా మంది,దాడులకు, హత్యలకు గురయ్యారు. మరి..తాజాగా జరిగిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.