iDreamPost
android-app
ios-app

తండ్రి చేయించిన హెయిర్ కట్ బాగా లేదని.. 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్య!

ఈ మధ్య కాలంలో చిన్నారులు చిన్న విషయాలకు మనస్తాపానికి గురికావడం, గొడవలకు దిగడం వంటివి చేస్తున్నారు. మరికొందరు పిల్లలు అయితే ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ 11 ఏళ్ల బాలుడు హెయిర్ కటింగ్ బాగాలేదని సూసైడ్ చేసుకున్నాడు.

ఈ మధ్య కాలంలో చిన్నారులు చిన్న విషయాలకు మనస్తాపానికి గురికావడం, గొడవలకు దిగడం వంటివి చేస్తున్నారు. మరికొందరు పిల్లలు అయితే ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ 11 ఏళ్ల బాలుడు హెయిర్ కటింగ్ బాగాలేదని సూసైడ్ చేసుకున్నాడు.

తండ్రి చేయించిన హెయిర్ కట్ బాగా లేదని.. 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్య!

నేటి సమాజంలో కొందరి పిల్లల ప్రవర్తన తీరు..వారి తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఎంతో బుద్దిగా, సహనంతో  తోటి పిల్లలతో బాల్యం గడపాల్సిన వారు దారుణమైన, ఘోరమైన ఆలోచనలు చేస్తున్నారు. కారణం ఏదైనప్పటికి పిల్లల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడం అందరిని కలవర పెడుతుంది. రిమోట్, పుస్తకం, ఫుడ్, ఆడుకునే వస్తువులు.. ఇలా చాలా చిన్న చిన్న విషయాల్లో కొందరు పిల్లలు తల్లిదండ్రులపై అలుగుతున్నారు. అంతేకాక ఆత్మహత్యలు చేసుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని ముగిస్తున్నారు. తాజాగా తండ్రి హెయిర్ కటింగ్ సరిగ్గా చేయించలేదని ఆరో తరగతి చదివే బాలుడు సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన మహబూబా బాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఈ మధ్య కాలంలో చిన్నారులు చిన్న విషయాలకు మనస్తాపానికి గురికావడం, గొడవలకు దిగడం వంటివి చేస్తున్నారు. పాఠశాల స్థాయిలోనే కొందరు దాడులకు కూడా తెగపడుతున్నారు. ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూ గొడవలకు దిగుతున్నారు. ఇవే దారుణంగా ఉన్నాయి అంటే.. తొమ్మిది, పదేళ్ల పిల్లల కూడా చిన్న చిన్న వాటికి మనస్తాపానికి గురై  ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు పిల్లల ఆలోచన ధోరణి ఎటువైపు వెళ్తుందో అర్థం కాక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆత్మహత్య అంటే ఏమిటో సరిగ్గా తెలియని వయస్సులో క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగిస్తున్నారు. పో

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చింతగూడెం గ్రామంలో ఈసం కాంతరావు అనే వ్యక్తి కుటుంబంతో  కలిసి నివాసం ఉంటున్నాడు.ఆయనకు ఇద్దరు కుమారులు సంతానంగా ఉన్నారు. చిన్న కుమారుడైన హర్షవర్ధన్ (11) సీతానాగారం హాస్టల్ లోఉంటూ ఆరో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం కాంతారావు..తన చిన్న కుమారుడు హర్షవర్ధన్ ను కటింగ్ షాపుకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో కటింగ్ పూర్తైన తరువాత  హర్షవర్ధన్ ముఖభావంగా ఉన్నాడు. తనకు ఇష్టం లేని కటింగ్ చేపించారని తండ్రితో వాగ్వాదానికి దిగాడు. అయితే తండ్రి కాంతరావు హర్షను బుజ్జగించి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చిన అనంతరం కాంతరావు వాళ్లు ఇంటి వెనుక పనులు చేసుకుంటున్నారు.

ఇదే సమయంలో ఇంట్లోకి వెళ్లిన హర్షవర్ధన్ పురుగుల మందు సేవించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హర్షవర్ధన్ ను తొలుత నర్సంపేట లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం హర్షవర్ధన్ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. హర్షవర్ధన్ మృతితో చింతగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత చిన్న వయస్సులో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడం అందరిని ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తుంది. ఇలా పిల్లలలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడానికి కారణం ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.