వేరే రాష్ట్రంలో భర్త జాబ్.. పిల్లలతో ఉంటున్న భార్య ఊహించని నిర్ణయం!

వేరే రాష్ట్రంలో భర్త జాబ్.. పిల్లలతో ఉంటున్న భార్య ఊహించని నిర్ణయం!

ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం. వాటిని అధికమించే మార్గాలను కనుగొని జీవితంలో ముందుకు వెళ్లాలి. కానీ నేటికాలంలో చాలా మంది మనుషుల్లో ఆత్మవిశ్వాసం, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం అనేవి లేకుండా పోయాయి. అందుకే ప్రతి చిన్న సమస్యకు ఆందోళన చెందుతుంటారు. అంతేకాక తమ ఒక్కరికే కష్టాలు వచ్చినట్లు మనోవేదన చెంది.. చావే పరిష్కారంగా భావిస్తుంటారు. ఈ క్రమంలో  సమస్యలకు భయపడి..ఆత్మహత్య చేసుకుని..నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఓ  మహిళకు ప్రభుత్వ ఉద్యోగం, ఇద్దరు పిల్లలతో చక్కగా సాగిపోతున్న జీవితంలో ఊహించని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం దూర భారమై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జనగామ జిల్లా రఘనాథపల్లి గ్రామానికి చెందిన మానుపాటి సంధ్యా కిరణ్(29) లింగాల ఘనపురం రెవెన్యూ ఆఫీస్ లో వీఆర్ఏగా విధులు నిర్వహించేది. ఆమె భర్త ఉపాధి కోసం గుజరాత్ లోని సూరత్ కు వారం క్రితం వెళ్లాడు. వీరికి యశ్వంత్, వర్షిత అనే కూతురు,కొడుకు ఉన్నారు.  ఇటీవలే ప్రభుత్వం సంధ్యను హైదరాబాద్ లోని బండ్లగూడ రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా నియమించింది.  భర్త వేరే రాష్ట్రంలో ఉండటం, అత్తమామలు మరో ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇక  పిల్లలను పిల్లలను ఓ ప్రైవేటు స్కూల్ లో చదివిస్తోంది. చిన్నారుల ఆలనాపాలనా చూడటంతో పాటు వారిని స్కూల్ కు పంపించి.. ఉద్యోగం దృష్టా హైదరాబాద్ వెళ్లి రావాల్సి వస్తోంది.

ఇలా రోజు హైదరాబాద్ నుంచి జనగామ కు వెళ్లి రావడం.. ఆమెకు భారంగా మారింది. ఈ విషయంలో గురువారం ఉదయం తీవ్ర మనస్తాపం చెంది… ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి  వెళ్లింది. స్థానికులు గమనించి..వెంటనే జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగానే సంధ్యా మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి..చిన్న చిన్న సమస్యలకు ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. మరి.. ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments