iDreamPost
android-app
ios-app

వీడియో: దారుణం.. ఐస్ క్రీంలో వీర్యం కలిపి అమ్ముతున్న వ్యాపారి!

వేసవి కాలం ఐస్‌క్రీమ్‌కు డిమాండ్ పెరగడంతో కొందరు కల్తీలను తయారు చేస్తున్నారు. ఇక తాజాగా ఐస్ క్రీమ్ అమ్మే ఓ వ్యక్తి చేసిన పని చూసి.. అందరూ షాకయ్యారు. పసిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అందరూ తినే ఐస్ క్రీమ్ విషయంలో దారుణం చేశాడు.

వేసవి కాలం ఐస్‌క్రీమ్‌కు డిమాండ్ పెరగడంతో కొందరు కల్తీలను తయారు చేస్తున్నారు. ఇక తాజాగా ఐస్ క్రీమ్ అమ్మే ఓ వ్యక్తి చేసిన పని చూసి.. అందరూ షాకయ్యారు. పసిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అందరూ తినే ఐస్ క్రీమ్ విషయంలో దారుణం చేశాడు.

వీడియో: దారుణం.. ఐస్ క్రీంలో వీర్యం కలిపి అమ్ముతున్న వ్యాపారి!

వేసవి కాలం ప్రారంభమైంది.. దీంతో శీతపానీయాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇలానే ఐస్ క్రీమ్ వంటి వాటికి కూడా ఫుల్ గిరాకీ ఉంటుంది. ఇక డిమాండ్ ను ఆసరాగ చేసుకుని కొందరు వ్యాపారులు కల్తీ ఐస్ క్రీమ్,కూల్ డ్రిక్స్ ను విక్రయిస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. కొందరు వెదవులు చేసే పనులు చాలా దారుణంగా ఉంటాయి. తాజాగా ఐస్ క్రీమ్ అమ్మే ఓ వ్యక్తి  చేసిన పని దారుణంగా ఉంది. ఛీ.. ఇలాంటి నీచులు కూడా ఉంటారా అనిపించేలా దారుణంగా ప్రవర్తించాడు. వీర్యం, యూరిన్ ని ఐస్ క్రీమ్ లో కలిపి అమ్ముతున్నాడు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వేసవి కాలం ఐస్‌క్రీమ్‌కు డిమాండ్ పెరగడంతో, నకిలీ తయారీదారులు కల్తీ ధోరణిని పెట్టుబడిగా పెడుతున్నారు. యాసిడ్, నాసిరకం పదార్థాలతో తయారు చేసిన ఐస్ వంటి ఘటనలు గతంలో వెలుగు చూసినా తాజాగా వరంగల్ జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలోని  నెక్కొండ ప్రాంతంలో బాలాజీ అనే ఐస్‌క్రీమ్‌ స్టాల్‌లో ఫలూదా ఐస్‌క్రీమ్‌ పేరుతో యూరిన్‌, సెమెన్‌ కలిపిన ఐస్‌క్రీమ్‌ విక్రయిస్తున్నట్లు సమాచారం. ఐస్‌క్రీం వ్యాపారి హస్తప్రయోగం చేసి, ఆపై తన వీర్యాన్ని ఫలూదాలో కలుపుతున్నాడు. ఈఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ  ఘటనపై సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు ఐస్ క్రీం బడ్లపై దాడులు నిర్వహించారు. ఈ కలుషిత ఐస్‌క్రీమ్‌ల తయారీ చేసి విక్రయంలో పాల్గొన్న పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలానే కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేసిన వారిపై అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఐస్ క్రీమ్ కంపెనీలో నిల్వ చేసిన ఫ్రూట్ సలాడ్‌ లను కూడా పరిశీలించారు. అవి నాణ్యంగా లేకపోవడంతో  పారవేశారు. రోడ్డు పక్కన బండ్ల నుంచి ఫలూదా ఐస్‌క్రీం విక్రయిస్తున్న వ్యాపారులకు, రోడ్డు పక్కన తినుబండారాల దుకాణాల యజమానులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆహార తయారీకి సంబంధించిన ప్రతి అంశంలో పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉందని, పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలనే నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.