iDreamPost
android-app
ios-app

రెండో పెళ్లి చేసుకుని.. మొదటి భర్తకి దగ్గరై.. డబుల్ గేమ్ తో దారుణంగా!

  • Published Mar 19, 2024 | 12:35 PM Updated Updated Mar 19, 2024 | 12:35 PM

ప్రేమించి పెళ్లి చేసుకొని, కొన్నాళ్లకే వివాదాలతో మరో పెళ్లి చేసుకున్న ఓ యువతి ఇంక మొదటి భర్తతో సన్నిహితంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు అదే ఆమెకు పెద్ద శాపంగా మారింది.

ప్రేమించి పెళ్లి చేసుకొని, కొన్నాళ్లకే వివాదాలతో మరో పెళ్లి చేసుకున్న ఓ యువతి ఇంక మొదటి భర్తతో సన్నిహితంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు అదే ఆమెకు పెద్ద శాపంగా మారింది.

  • Published Mar 19, 2024 | 12:35 PMUpdated Mar 19, 2024 | 12:35 PM
రెండో పెళ్లి చేసుకుని.. మొదటి భర్తకి దగ్గరై.. డబుల్ గేమ్ తో దారుణంగా!

ఈ మధ్య ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి కామన్ అయిపోయాయి. అయితే ఇది ఒక్క సెలబ్రిటీస్ జీవితంలోనే అనుకుంటే పొరపాటే. సామన్యలు విషయంలో కూడా ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. అయితే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వారు సంతోషంగా కలకాలం ఉంటారునుకుంటే.. అంతలోనే తగదాలు వచ్చి విడపోతున్నారు. ఇక విడిపోయిన తర్వాత ఎవరి దారి వారు బ్రతకడం, వేరే పెళ్లిళ్లు చేసుకోవడం ఇది అంతా అందరికీ తెలిసిన విషయమే. కానీ, విడాకులు తీసుకొని.. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎవరు మొదట భర్తతో సన్నిహితంగా ఉండరు. అయితే అలా ఉండటమే ఓ మహిళకు శాపంగా మారింది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా మొదట భర్తతో మాట్లడమే నేడు ఇంతటి ఘోరం చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట మధ్య కొన్నాళ్లకే కలాహాలు రావడంతో.. విడాకులు తీసుకున్నారు. అలా తీసుకున్న వారిలో సదరు యువతి మరో వివాహం చేసుకున్న.. మొదటి భర్తతో సన్నిహితంగా ఉంటుంది. అయితే అదే ఆమెకు పెద్ద శాపంగా మారి ఊహించని ఘరం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. జగిత్యాల పట్టణానికి చెందిన కరిపే అంజలి.. గొల్లపల్లి మండలం అగ్గిమల్లకు చెందిన కొల్లూరి నరేశ్ ప్రేమించుకున్నారు. కాగా, నాలుగేళ్ల క్రితం వీరిద్దరికి వివాహం కూడా జరిగింది.కానీ, కుటుంబ కలహాల కారణంగా రెండేళ్ల క్రితం ఈ జంట విడాకులు తీసుకున్నారు. అనంతరం అంజలిని సిద్దిపేటకు చెందిన వ్యక్తికిచ్చి మరో పెళ్లి చేశారు. అయినా మొదటి భర్త నరేశ్ తో అంజలి తరుచూ ఫోన్ లో మాట్లాడుతుండేది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సిద్దిపేట నుంచి జగిత్యాలలోని పుట్టింటికి వచ్చిన అంజలికి మాజీ భర్త నరేశ్ ఫోన్ చేశాడు. ఈనెల 17న తన బైక్ పై తీసుకెళ్లాడు. అయితే మ్యాడంపల్లి శివారులో ఏం జరిగిందో ఏమో కానీ, ఇద్దరి మధ్య గొడవ జరగడంతో నరేశ్.. అంజలిని గొంతునులిమి చంపి చెట్లపొదల్లో పడేశాడు.

కాగా, సోమవారం అటుగా వెళ్లిన స్థానికులకు అంజలి మృతదేహాం గుర్తించడంతో.. జగిత్యాల పోలీసులకు సమాచారం అందిచారు. దీంతో సీఐ నీలం రవి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాలకు తరలించారు.ఇక మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మరి, రెండో పెళ్లి చేసుకొన్న యువతి మొదటి భర్తతో సన్నిహితంగా ఉంటూ అతడి చేతిలోనే ఇలా బలైపోయినా ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet