Siddipet Thief Case: అంబులెన్స్ దొంగలించిన దొంగ! అరగంటలో యాక్సిడెంట్ అయ్యి!

అంబులెన్స్ దొంగలించిన దొంగ! అరగంటలో యాక్సిడెంట్ అయ్యి!

Siddipet Theft Case: ఇటీవల డబ్బు సంపాదించడానికి కేటుగాళ్లు అనేక నేరాలకు పాల్పపడుతున్నారు. ఎలాంటి నేరాలు చేసిన వారైనా ఎప్పుడో ఒకసారి పోలీసులకు చిక్కిపోతుంటారు. ఓ దొంగ తన పనిహ్యాపీగా ముగిసిందనుకునే లోపు బ్యాడ్ లక్ వెంటాడింది.

Siddipet Theft Case: ఇటీవల డబ్బు సంపాదించడానికి కేటుగాళ్లు అనేక నేరాలకు పాల్పపడుతున్నారు. ఎలాంటి నేరాలు చేసిన వారైనా ఎప్పుడో ఒకసారి పోలీసులకు చిక్కిపోతుంటారు. ఓ దొంగ తన పనిహ్యాపీగా ముగిసిందనుకునే లోపు బ్యాడ్ లక్ వెంటాడింది.

ఈ మధ్య చాలా మంది సొసైటీలో లగ్జరీగా బతకాలని కోరికతో  తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఎన్నో అక్రమాలు, మోసాలకు తెగబడుతున్నారు.  చైన్ స్నాచింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమాయుధాల వ్యాపారం, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో రకాల దందాలకు చేస్తూ లక్షలు, కోట్లు గడిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి ఎంత కాలం తప్పించుకున్నా.. ఏదో ఒక తప్పు చేసి అడ్డంగా బుక్ అవుతుంటారు. తాజాగా సిద్దిపేటలో ఓ వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ దొంగ హాస్పిటల్ ముందు ఉంచిన అంబులెన్స్ దొంగిలించి తీసుకు వెళ్లాడు.కొద్ది గంటల్లోపే ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సిద్దిపేటలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యం బాగాలేదని వచ్చాడు యువకుడు. అంతలోనే తన దొంగబుద్ది చూపించాడు. ఆ దొంగ చూపు ఆస్పత్రి ముందు ఉన్న అంబులెన్స్ పైడింది. ఇంకేముంది తన చేతివాటం చూపించాడు.. మెల్లిగా అంబులెన్స్ తో అక్కడ నుంచి ఉడాయించాడు. హ్యాపీగా అంబులెన్స్ దొంగనం చేసి ఎంతో అంతకు అమ్మేసి వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేయాలని రక రకాల ఊహలతో వెళ్తున్న అతన్ని దరిద్రం వెంటాడింది.. హైదరాబాద్ రాజీవ్ రహదారిపై దుద్దెడ టోల్ గేట్ వద్ద ప్రమాదానికి గురైంది.ఇక్కడే విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.. సదరు దొంగ ఎక్కడ నుంచి అయితే అంబులెన్స్ ఎత్తుకొచ్చాడు.. తిరిగి అదే హాస్పిటల్ లో పేషెంట్ గా జాయిన్ కావాల్సి వచ్చింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు కథనం ప్రకారం మద్దూరు మండలం రేపర్తి గ్రామానికి చెందిన వల్లెపు అశోక్ అనే వ్యక్తి సిద్దిపేట జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఉంచిన అంబులెన్స్ ని దొంగిలించాడు. అనుకోకుండా ప్రమాదానికి గురి కావడంతో స్థానికులు సిద్దిపేట జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. సదరు దొంగ చేసిన ఘనకార్యం గురించి తెలిసి హాస్పిటల్ సిబ్బంది, పోలీసులు  ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు ఉపయోగపడే అంబులెన్స్ ని దొంగిలించినందుకు ఆ దొంగకు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు స్థానికులు.

Show comments