స్కాన్ సెంటర్ కేసులో ఖంగుతిన్న పోలీసులు..ఒక్కరు కాదు వందల్లో బాధితులు!

ఇటీవలే నిజామాబాద్ జిల్లాలో అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో జరిగిన ఉదంతాం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మరిన్ని నిజాలు బయటపడటంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

ఇటీవలే నిజామాబాద్ జిల్లాలో అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో జరిగిన ఉదంతాం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మరిన్ని నిజాలు బయటపడటంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

ఇటీవలే నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.స్థానికంగా ఉన్న అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో స్కానింగ్ కోసం వచ్చే మహిళలపై.. అదే సెంటర్ లో పనిచేస్తున్న ప్రశాంత్ అనే కిరాతకుడు అకృత్యలకు పాల్పడటం తీవ్ర కలకరం రేపుతోంది. కాగా, ఇలా స్కానింగ్ కోసం వచ్చే ఎంతోమంది మహిళలు, యువతులకు తెలియకుండానే వారి అశ్లీల ఫోటోలను, వీడియోలను రికార్డు చేసిన ఆ కేటుగాడు.. తిరిగి వారిని టార్గెట్ చేస్తూ.. ఫోన్ లు చేసి బెదిరించడం మొదలుపెట్టేవాడు.అంతేకాకుండా..ఆ ఫోటోలను, వీడియోలను చూపించి తన కామ కోర్కెలను తీర్చుకునేవాడు.అయితే గతకొన్నాళ్లుగా ఈ దారుణం అనేది కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలోనే..ఓ బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అలాగే ఈ వ్యవహారం కాస్త సీరియస్ కావడంతో.. దీనిపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు నోటీసులు జారీ కూడా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ స్కానింగ్ సెంటర్ లో విషయంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఈ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ిషయంలో మరిన్ని కీలక విషయాలు బయటకి వస్తున్నాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ లో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మరిన్ని కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. అయితే ఈ విచారణలో కలెక్టర్ ఆదేశాలతో సీపీ కల్మేశ్వర్‌, డీసీపీ శేషాద్రిరెడ్డి నేతృత్వంలో సీఐ శ్రీలత విచారణ చేపట్టారు. కాగా, నిందితుడు ప్రశాంత్ మొబైల్ నుంచి సేకరించిన డాటాను హార్డ్ డిస్క్ లో భద్రపరిచినట్లు సమాచారం తెలిసింది. దీంతో నిందితుడు ఫోన్ను పోలీసులు పరిశీలించగా.. అందులో మరిన్ని అశ్లీల వీడియోలు, రాసలీలలు, స్కానింగ్ చిత్రాలు ఉన్నట్లు బయటపడ్డాయి. అయితే మొదట ఒక్కరే బాధితురాలు అనుకున్న పోలీసులు.. ఆ తర్వాత మొబైల్ ను పరిశీలించిన తర్వాత చూసి ఖంగుతిన్నారు. ఎందుకంటే.. నిందుతుడి మొబైల్ లో ఒక్కరు కాకుండా.. వందల సంఖ్యల్తో మహిళల వీడియోలు తీసి ఉన్నట్లు గుర్తించారు. అయితే తన మొబైల్ నుంచి ఫోటోలు, వీడియోలను నిందితుడు వేరో ఎవరికైనా పంపించాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. ఇక ఇలా ఎంతమంది మహిళలు బ్లాక్ మెయిల్ చేశాడో అనే వివరాలను  తెలుసుకుంటున్నారు.

అయితే సారంగాపూర్‌కు చెందిన ప్రశాంత్‌ కొన్నేండ్లుగా అయ్యప్ప స్కానింగ్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. కాగా, ఇలా  స్కానింగ్‌ కోసం వచ్చే మహిళల్లో రోజుకు ఐదుగురి నుంచి 15  మంది వీడియోలను చిత్రీకరించినట్లు తెలిసింది. ఇక  స్కానింగ్‌ సెంటర్‌లో సీక్రెట్‌ కెమెరా పెట్టి దాని ద్వారా ఫొటోలు, వీడియోలు తీసేవాడని సమాచారం. ఇక ముందుగా స్కానింగ్‌ సెంటర్లకు వచ్చే యువతులను దుస్తులు మొత్తం విప్పితేనే పక్కాగా రిపోర్టు వస్తుందని నమ్మించి సీక్రెట్‌ కెమెరాతో బంధించేవాడని, వివరాల నమోదు సమయంలో మహిళలు ఇచ్చే మొబైల్‌ నంబర్లను తీసుకొని వారిని బెదిరించే వాడని తెలిసిందే. అంతేకాకుండా.. వారిని శారీరకంగా వాడుకోవడంతోపాటు డబ్బులు తీసుకుంటూ వదిలేసేవాడని సమాచారం. ఇక కొంతమంది గర్భిణులకు లింగనిర్ధారణ చేస్తానని చెప్పి డబ్బులు డిమాండ్‌ చేసిన ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. దీంతో వీడియోలు తీసిన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు మిగతా స్కానింగ్‌ సెంటర్లలో తనిఖీలు చేస్తున్నాం. అందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇకపోతే స్కానింగ్‌ సెంటర్లకు వెళ్లే మహిళలు అనుమానం వస్తే వెంటనే డాక్టర్లకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

Show comments