iDreamPost
android-app
ios-app

ఆదిలాబాద్‌లో సందడి చేసిన గ్రేట్‌ ఖలీ.. చూడ్డానికి ఎగబడ్డ జనం!

  • Published Sep 28, 2023 | 9:49 PM Updated Updated Sep 28, 2023 | 9:49 PM
  • Published Sep 28, 2023 | 9:49 PMUpdated Sep 28, 2023 | 9:49 PM
ఆదిలాబాద్‌లో సందడి చేసిన గ్రేట్‌ ఖలీ.. చూడ్డానికి ఎగబడ్డ జనం!

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌ ది గ్రేట్‌ ఖలీ ఆదిలాబాద్‌లో సందడి చేశారు. గురువారం జరిగిన గణేష్‌ నిమజ్జన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. మహాలక్ష్మి గణేష్‌ మండల్‌ పిలుపు మేరకు ఆయన నిమజ్జన కార్యక్రమానికి హాజరయ్యారు. ఖలీకి ఆదిలాబాద్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. మహాలక్ష్మి గణేష్‌ మండల్‌  అధ్యక్షుడు ఆధిత్య ఖండేష్కర్‌కు ఖలీ మంచి మిత్రుడు. గతంలో ఓ సారి కూడా ఆయన ఆదిలాబాద్‌ వచ్చారు. ఆయన ర్యాలీ నిర్వహించాలని అనుకున్నారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ర్యాలీకి పర్మిషన్‌ ఇవ్వలేదు. దీంతో గణేష్‌ విగ్రహానికి పూజలు చేసి వెళ్లిపోయారు. ఈ సారి మాత్రం ర్యాలీకి అవకాశం దొరికింది.

కారులో ఆయన పర్యటించారు. ఖలీ తమ పట్టణానికి వచ్చాడని తెలుసుకున్న జనం పెద్ద ఎత్తున ఆయన్ని చూడ్డానికి తరలివచ్చారు. ఆయనతో పొటోలు, సెల్ఫీలు దిగటానికి ఎగబడ్డారు. ప్రస్తుతం ఖలీ ఆదిలాబాద్‌లో పర్యటించిన దృశ్యాల తాలూకా వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, 2000 సంవత్సరంలో ఖలీ రెస్లింగ్‌ కెరీర్‌ను మొదలుపెట్టారు. దాదాపు 20 ఏళ్లు డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్లు చేశారు. డబ్ల్యూడబ్ల్యూఈలో ఉండగానే.. 2015లో పంజాబ్‌లో సొంత రెస్లింగ్‌ స్కూలు ఏర్పాటు చేశారు. తర్వాతినుంచి డబ్ల్యూడబ్ల్యూఈ కార్యక్రమాల్లో పాల్గొనటం తగ్గించారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş