TGSRTC: ఇతర రాష్ట్రాల ప్రయాణీకులకి TGSRTC గుడ్ న్యూస్! ఇక ఆ కష్టం తీరినట్టే!

TGSRTC: ఇతర రాష్ట్రాల ప్రయాణీకులకి TGSRTC గుడ్ న్యూస్! ఇక ఆ కష్టం తీరినట్టే!

TGSRTC.. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు, విద్యార్థినులకు, యువతకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తుంది టీజీఎస్ఆర్టీసీ. ఈ క్రమంలో ఆ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది.

TGSRTC.. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు, విద్యార్థినులకు, యువతకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తుంది టీజీఎస్ఆర్టీసీ. ఈ క్రమంలో ఆ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణలో ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రంలో జీవిస్తున్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్. అప్పటి నుండి ఆధార్, ఓటర్ కార్డు సాయంతో ఉచితంగా ట్రావెల్ చేస్తున్నారు మహిళలు.  రాష్ట్ర వ్యాప్తంగా ఈ సౌకర్యం ఉండటంతో సద్వినియోగపర్చుకుంటున్నారు విద్యార్థినులు, ఉద్యోగినులు, మహిళలు, యువతులు. కాగా, పురుషులు, లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రయాణీకులు మాత్రం టికెట్ తీసుకుని ప్రయాణం చేయాల్సిందే. అదే ఉద్యోగులు అయితే.. బస్సు పాస్ తీసుకుని జర్నీ చేస్తున్నారు. నెల పాస్ తీసుకుని నగరంలో ప్రయాణిస్తుంటారు.  ఇలాంటి ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది.

హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రయాణీకులు ఎక్కువగా బస్ పాస్ తీసుకుని ప్రయాణీస్తుంటారు. అయితే కొన్ని చోట్ల  బస్ పాస్ కౌంటర్స్ లేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. వారి కోసం కొత్తగా కొన్ని ప్రాంతాల్లో బస్సు పాస్ కౌంటర్లు పెట్టినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం పాత కౌంటర్లకు అదనంగా మరికొన్నింటిని  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులకు ఉపయోగ పడే విధంగా అదనపు కౌంటర్లను ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.  JNTU బస్టాప్, లక్డీకపూల్ బస్టాపుల్లో ఈ కౌంటర్లను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 గంటల వరకు బస్ పాస్ కౌంటర్లు పని చేస్తాయని చెప్పారు.

ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ కౌంటర్లు పని చేస్తాయన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు గంటలకొద్దీ క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. గతంతో పోలిస్తే.. ఇప్పుడు బస్ పాస్ కేంద్రా వద్ద అంత రద్దీ లేకపోయినప్పటికీ.. పురుషులు, విద్యార్థులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణీకుల నిమిత్తం ఈ ఏర్పాట్లు చే సింది.  అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రయాణీకుల సౌకర్యార్థం కొత్తగా గ్రీన్‌ మెట్రో లగ్జరీ నెలవారీ బస్సు పాస్‌లను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 219 రూట్ నెంబరుతో సికింద్రాబాద్‌ – పటాన్‌చెరు మధ్య, 195 రూటు నెంబరుతో బాచుపల్లి – వేవ్‌రాక్‌ పార్కు మధ్య, 127K నెంబరుతో కొండాపూర్‌ – కోఠి మధ్య ఏసీ బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్ పాస్ ధర రూ.1900గా నిర్ణయించారు. ఈ రూట్లలో ప్రయాణాలు సాగించేవారు గ్రీన్ మెట్రో లగ్జరీ నెలవారీ బస్సు పాసులను తీసుకోవాలని సూచించారు TGSRTC అధికారులు. ఈ పాస్ తో నగర వ్యాప్తంగా  గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే సదుపాయం లభిస్తుంది.

Show comments