TG Congress-Job Notifications Within 2 Weeks: నిరుద్యోగులకు శుభవార్త.. 2 వారాల్లోనే భారీగా నోటిఫికేషన్లు.. T కాంగ్రెస్‌ ప్రకటన

నిరుద్యోగులకు శుభవార్త.. 2 వారాల్లోనే భారీగా నోటిఫికేషన్లు.. T కాంగ్రెస్‌ ప్రకటన

రేవంత్‌ సర్కార్‌ తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీకాంగ్రెస్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

రేవంత్‌ సర్కార్‌ తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీకాంగ్రెస్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడానికి.. బీఆర్‌ఎస్‌ ఓటమికి ప్రధాన కారణాల్లో నిరుద్యోగ సమస్య ఒకటి. నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వరుసగా పేపర్లు లీక్‌ కావడం, నోటిఫికేషన్లు ఆలస్యం కావడం.. ఇచ్చిన వాటిల్లో లీగల్‌ సమస్యలు తలెత్తి.. ఫలితాల వెల్లడి ఆలస్యం కావడం వంటి సమస్యలు నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడింది. ఈసమస్యను పసిగట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. నిరుద్యోగులను ఆకర్షించడం కోసం అనేక హామీలను ప్రకటించింది. దాంతో నిరుద్యోగులు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారు. ఇక అధికారంలోకి రాగానే ముందుగా టీఎస్‌పీఎస్‌సీ బోర్డును రద్దు చేసి పూర్తిగా ప్రక్షాళన చేసి.. కొత్త మెంబర్లను నియమించింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో నోటిఫికేషన్ల వెల్లడికి, జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో రేవంత్‌ సర్కార్‌ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోన్నట్లు సమాచారం. ఆ వివరాలు..

రాష్ట్రంలోని నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. గుడ్‌ న్యూస్‌ చెప్పడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. మరో రెండు వారాల్లో వరుసగా జాబ్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అయితే మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు రావటంతో.. ప్రజాపాలనకు కాస్త బ్రేకులు పడ్డాయని.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వరుస సమావేశాలతో ఒక్కో సమస్యపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెడుతోందని తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ క్రమంలోనే… మరో 2 వారాల్లో జాబ్ నోటిఫికేషన్ కూడా వెలువడుతుందని ప్రకటించింది.

అయితే.. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.. ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీ చేపడతామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఈ జాబ్ క్యాలెండర్‌ గ్యారెంటీని నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా.. తమ సమస్యలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం.. గ్రూప్‌ 2, 3 పోస్టుల పెంపుపై ప్రకటన లేకపోవడంతో.. రాష్ట్రంలోని నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు. పలుచోట్ల నిరుసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్‌కు.. తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.

‘‘కేటీఆర్.. మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడటం, వారిని కలవడం ఎలా ఉందంటే.. నేరం చేసిన వ్యక్తి వచ్చి.. నేనే సాక్షిని.. అక్కడ జరిగింది హత్య కాదు, ఆత్మహత్య. అది నేను కళ్ళారా చూశాను అని చెప్పాడంట. అలా ఉంది మీ తీరు. పరీక్ష పేపర్లు అమ్ముకుని.. ఎగ్జామ్స్‌ను పారదర్శకంగా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం మీది. పదేళ్లు అధికారం అనుభవించి, ఉద్యోగాలు భర్తీ చేయని అసమర్థ నాయకులు మీరు. అలాంటి మీరు ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడటం ఎలా ఉందంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది’’ అంటూ టీ కాంగ్రెస్‌ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేసింది. గుప్పించింది.

‘‘తెలంగాణ యువత విలువైన దశాబ్ద కాలాన్ని, ఆశలను, ఆశయాలను నాశనం చేశారు. దాన్ని సరిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి.. ఉద్యోగాలను భర్తీ చేస్తూ.. గతంలో ఉన్న తప్పులను సరిచేస్తూ.. విద్యార్థి, నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలను తీసుకుంటూ పరీక్షలు నిర్వహించే పనిలో నిమగ్నమై ఉంది’’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ వివరించింది. ఈ ప్రకటన నిరుద్యోగులకు కాస్త ఊరట కలిగిస్తోంది.

Show comments