iDreamPost
android-app
ios-app

శ్రీవారి భక్తుల కోసం సూపర్‌ ప్యాకేజీ.. ఒక్కరోజులో తిరుమల టూర్​.. ఫ్రీగా దర్శనం.. పూర్తి వివరాలివే..!

  • Published May 11, 2024 | 11:44 AM Updated Updated May 11, 2024 | 7:16 PM

Tirumala Tour: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్‌ అందుబాటులోకి వచ్చింది. కేవలం ఒక్క రోజులో తిరుమల వెళ్లి రావచ్చు. ఆవివరాలు..

Tirumala Tour: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్‌ అందుబాటులోకి వచ్చింది. కేవలం ఒక్క రోజులో తిరుమల వెళ్లి రావచ్చు. ఆవివరాలు..

  • Published May 11, 2024 | 11:44 AMUpdated May 11, 2024 | 7:16 PM
శ్రీవారి భక్తుల కోసం సూపర్‌ ప్యాకేజీ.. ఒక్కరోజులో తిరుమల టూర్​.. ఫ్రీగా దర్శనం.. పూర్తి వివరాలివే..!

కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు తరలి వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఇక సెలవులు, ప్రత్యేక పర్వదినాల వేళ స్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో.. మిగతా రోజుల కన్నా కాస్త ఎక్కువగా భక్తులు తిరుపతి వచ్చి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఇక తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే నెలల ముందు నుంచే ప్లాన్‌ చేసుకోవాలి. కనీసం నెల రోజుల ముందే రైలు టికెట్లు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దర్శనం టికెట్లు విడుదల చేసినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నిరాశే ఎదురవుతుంది.. మళ్లీ నెలరోజులు నిరీక్షించాల్సిందే.

అయితే ఇలాంటి ఇబ్బందులు ఇక మీదట ఉండబోవు. ఒక్క రోజులోనే తిరుమల వెళ్లి రావడమే కాక.. ఉచితంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది తెలంగాణ టూరిజం శాఖ. రాష్ట్ర పర్యాటక శాఖ తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే ప్యాకేజీని ప్రకటించింది. సాధారణంగా అయితే.. హైదరాబాద్ నుంచి తిరుమల పర్యటనకు వెళ్లాలంటే ఎంతకాదన్నా.. కనీసం 4 రోజులైనా పడుతుంది. కానీ తెలంగాణ పర్యాటక శాఖ మాత్రం శ్రీవారి భక్తుల కోసం ఒక్కరోజు టూర్ ప్యాకేజీని అమల్లోకి తీసుకొచ్చింది.

తెలంగాణ నుంచి తిరుమల వెళ్లాలనుకునే వారు.. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ పర్యటన పూర్తి చేసుకోవచ్చు. దీన్ని తెలంగాణ పర్యాటక శాఖ ఆపరేట్ చేస్తుంది. అయితే.. ఈ ప్యాకేజీ ఎంచుకున్న భక్తులు.. బస్సులోనే వెళ్లాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ‌లో పెద్దలకైతే ఒక్కొక్కరికీ టికెట్ ధర 3,700 రూపాయలు ఉండగా.. చిన్నారులకు 2,960 రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాకుండా.. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. అంతేకాదు.. ఈ ప్యాకేజీలో కేవలం స్వామివారి దర్శనమే కాకుండా.. ఆ ఒక్క రోజులోనే తిరుమల, తిరుపతిలోని ఇతర ఆలయాలను కూడా కవర్ చేస్తారు.

తిరుమల టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు..

  1. మొదటి రోజు: సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు తిరుమల బయల్దేరుతుంది. (సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9848540374)
  2. రెండో రోజు: ఉదయం 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. అక్కడ అల్పాహారం చేసిన తర్వాత స్థానికంగా ఉండే ఆలయాలను దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. అనంతరం తిరుపతికి చేరుకుంటారు. తిరుపతిలో ఉన్న పలు ఆలాయాలను దర్శించుకున్న తర్వాత.. సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
  3. మూడో రోజు: ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

తెలంగాణ టూరిజం బస్సు ప్యాకేజీలో టిక్కెట్లు బుక్ చేసుకున్న యాత్రికులందరూ తెలంగాణ టూరిజం బస్సులో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది.

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap