తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటి నుండంటే? ఈసారి ఎక్కువ వచ్చే ఛాన్స్!

ఇంటర్ ఎగ్జామ్స్ ముగిసిపోయాయి. పదో తరగతి పరీక్షలు కూడా చివరి దశకు వచ్చేశాయి. ఇక మిగిలిన తరగతులకు పరీక్షలు జరగనున్నాయి. ఇవి ముగిశాక వేసవి సెలవులు. సమ్మర్ హాలీడేస్ ఎప్పటి నుండంటే..?

ఇంటర్ ఎగ్జామ్స్ ముగిసిపోయాయి. పదో తరగతి పరీక్షలు కూడా చివరి దశకు వచ్చేశాయి. ఇక మిగిలిన తరగతులకు పరీక్షలు జరగనున్నాయి. ఇవి ముగిశాక వేసవి సెలవులు. సమ్మర్ హాలీడేస్ ఎప్పటి నుండంటే..?

తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంవత్సరం ఏప్రిల్ నాటికి ముగియనుంది. ప్రస్తుతం పరీక్షల కాలం. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. పదవ తరగతి పరీక్షలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఎగ్జామ్స్ ముగించేసి.. తదుపరి ఏడాది సిలబస్ కూడా స్టార్ చేశారు. కానీ ప్రభుత్వ బడుల్లో మిగిలిన తరగతులకు ఏప్రిల్ నుండి పరీక్షలు మొదలయ్యే అవకాశాలున్నాయి. ఓ వైపు ఎండ కూడా మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒంటి పూడ బడులు షెడ్యూల్ చేసిన సంగతి విదితమే. ఇక పరీక్షలు అయిపోగానే.. వేసవి సెలవులు ఉండనున్నాయి. కాగా, తెలంగాణలో ఎప్పటి నుండి వేసవి సెలవులు ఉండనున్నాయి అంటే..

ఇలా ఎండకాలం మొదలైందో లేదో అలా భానుడు భగభగ మండిపోతున్నాడు. పొద్దున్నే సూరీడు డ్యూటీ ఎక్కుతుండటంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటి పూట బడులిచ్చింది తెలంగాణ సర్కార్. ప్రస్తుతం తెలంగాణలో మార్చి 15 నుండి హాఫ్ డే స్కూల్స్ అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. ఏప్రిల్ 23 వరకు తెలంగాణలో ఒంటి పూట బడులు ఉంటాయి. ఏప్రిల్ 24న కూడా స్కూల్ వర్కింగ్ డే అని తెలుస్తోంది. ఎండల దృష్ట్యా వచ్చే నెల 25 నుండి వేసవి సెలవులు ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ సారి పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇంకా ముందుగానే పరీక్షలు నిర్వహించి సమ్మర్ హాలీడేస్ ప్రకటించే వీలున్నట్లు కూడా సమాచారం. తర్వలోనే విద్యా శాఖ అధికారిక ప్రకటన వెల్లడించనుంది. అన్ని పాఠశాలలకు సమ్మర్ హాలీడేస్ ప్రకటించనుంది విద్యా శాఖ.

ఏప్రిల్ 25 నుండి హాలీడేస్ మొదలై జూన్ 9, 10 వరకు సెలవులు ఉండనున్నాయి. జూన్ 11 లేదా 12 వ తేదీన స్కూల్స్ రీ ఓపెన్ అయ్యే అవకాలున్నాయి. అప్పటి వరకు వేసవి సెలవులు ఉండనున్నట్లు సమాచారం. ఈ లెక్కన 45 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు రానున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువ ఉండటంతో ఈ సెలవులు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి.  అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంతో పాటు కాస్తంత హడావుడి ఉంటున్న నేపథ్యంలో  కూడా పొడిగింపు ఉండవచ్చునని అంచనా. ఈ లెక్క ప్రకారం ఈ ఏడాది ఎక్కువ సెలవులు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

ప్రస్తుతం తెలంగాణలో ఒంటి పూట బడుల నేపథ్యంలో ఉదయం 8 గంల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చు. కాగా, తొమ్మది పూర్తి చేసి పదో తరగతికి వెళ్లే విద్యార్థలుకు స్పెషల్ క్లాసులు తీసుకోవడంపై సీరియస్ అయ్యింది విద్యా శాఖ. నిబంధనలకు విరుద్దంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ప్రకటించింది. ప్రస్తుతం ఎండలు ముదురుతున్నందున.. పిల్లల్ని బయటకు పంపవద్దని సూచిస్తున్నారు విద్యా శాఖ అధికారులు.

Show comments