తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana State Song: నేడు తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భాదినోత్సవ వేడుకలో పాల్గొన్నారు.

Telangana State Song: నేడు తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భాదినోత్సవ వేడుకలో పాల్గొన్నారు.

60 ఏళ్లకై పైగా ఎందరో త్యాగవీరులు పోరాటం చేస్తే వచ్చింది తెలంగాణ రాష్ట్రం. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా ‘తెలంగాణ ఆవిర్బావదినోత్సవం’ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గన్ పార్క్ లోని అమరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారలు లతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి లోగో, రాష్ట్ర గీతం విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..

ఆదివారం (జూన్ 2) తెలంగాణ ఆవిర్బావ వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ప్రముఖ కవి అందెశ్రీ రాయగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. సింగర్ రేవంత్, హారికా నారాయణ పాడారు. పరేడ్ అనంతరం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరించారు.. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ మొత్తం చప్పట్ల, జై తెలంగాణ అంటూ మారో మోగింది. ఈ సందర్బంగా గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కిరవాణి కూడా పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి సందేశాన్ని ప్రదర్శించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు ప్రతి ఒక్కటీ అమలు అవుతాయని మరోసారి హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రభుత్వం పై ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రజలకు తమను నమ్మి అధికారాన్ని అప్పజెప్పినందుకు తెలంగా అభివృద్దికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని.. ప్రజలకు సుపరిపాలన అందిస్తామని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది పోరాడాడి తమ ప్రాణాలు త్యాగం చేశారని..వారి త్యాగాలు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. తెలంగాణ బానిసత్వం సహించబోదని అన్నారు.

 

Show comments