Rythu Bandhu: రైతుబంధుపై రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఏం చెప్పారంటే

రైతుబంధు నిధులు కోసం ఎదురు చూస్తోన్న అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు..

రైతుబంధు నిధులు కోసం ఎదురు చూస్తోన్న అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు..

బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించడం కోసం రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎకరానికి రూ.10 వేల చొప్పున.. ఏడాదికి రెండు సార్లు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతు బంధు నిధులు పెంచుతామని.. కౌలు రైతులకు కూడా సాయం చేస్తామని ప్రకటించింది. అదలా ఉంచితే నవంబర్ లోనే రెండో విడత రైతు బంధు నిధులు అన్నదాతల ఖాతాలో జమ కావాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. రైతుబంధుకు బ్రేక్ పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బాధ్యతలు స్వీకరించగానే.. రైతుబంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ప్రక్రియ అంత వేగవంతంగా సాగడం లేదు.

మూడు వారాల కిందటే రైతుబంధు డబ్బుల జమ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పారు. మొదట 10 గుంటల భూమి ఉన్న రైతన్నల ఖాతాలో రైతుబంధు నిధులు జమ చేసిన ప్రభుత్వం.. తర్వాత అర ఎకరం ఉన్నవాళ్లకు నిధులను జమ చేసింది. ఆ తర్వాత నేటి వరకు కూడా ఎకరం పై భూ విస్తీర్ణం కలిగిన రైతన్నలకు డబ్బు జమ కాలేదు. రైతుబంధు డబ్బుల జమ ప్రక్రియ వేగంగా సాగటం లేదు. గుంటల వారీగా డబ్బులను జమ చేస్తోంది ప్రభుత్వం.

నిన్నటి వరకు కేవలం గుంటలలోపు ఉన్న వారికి మాత్రమే సందేశాలు రాగా… ఎకరానికి పైగా ఉన్న వారికి మాత్రం ఇంకా డబ్బులు జమ కాలేదు. ఈ క్రమంలో తాజాగా వారికి రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. నేడు ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల భూమి ఉన్న రైతన్నల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి అని వెల్లడించింది. ఒకటి లేదా రెండు రోజుల్లో మిగిలిన రైతన్నల ఖాతాల్లో రైతుబంధు నిధులను జమ చేయనున్నారు అధికారులు. ఒకవేళ మీరు కూడా రైతుబంధు లబ్ధిదారులు అయితే.. మీ ఖాతాలో నిధులు జమ అయ్యాయా.. లేదా అనేది చెక్ చేసుకోండి.

కొత్త పాస్ బుక్ వచ్చిన వారికి కీలక అప్డేట్..

అంతే కాకుండా.. కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతులకు సంబంధించి కూడా రేవంత్ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులను స్వీకరించింది ప్రభుత్వం. అయితే రెండు రోజుల నుంచి దరఖాస్తులను స్వీకరించకుండా సైట్ ను ఫ్రీజ్ చేసినట్లు తెలిసింది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ ఏడాది జూన్ నుంచి రైతుబంధు స్థానంలో రైతు భరోసా ద్వారా డబ్బులను రైతన్నల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేయనుంది.

Show comments