iDreamPost
android-app
ios-app

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కన్నుమూత!

  • Published Sep 29, 2024 | 4:53 PM Updated Updated Sep 29, 2024 | 4:53 PM

Uttam Kumar Reddy Father Passed away: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో, రాజకీయ నేతల కుటుంబాల్లో వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Uttam Kumar Reddy Father Passed away: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో, రాజకీయ నేతల కుటుంబాల్లో వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

  • Published Sep 29, 2024 | 4:53 PMUpdated Sep 29, 2024 | 4:53 PM
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కన్నుమూత!

ఇటీవల సినీ, రాజకీయ నేతల కుటుంబాల్లో వరుస విషాదాలో నెలకొంటున్నాయి. వయోభారం, హార్ట్ ఎటాక్, అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు ఇతర కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబాల్లోనే కాదు వారిని అభిమానించే అభిమానులు, కార్యకర్తలు దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో పలువురు నేతలు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి పురుషోత్తమ్ రెడ్డి ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  ఉత్తమ్ తండ్రి మృతి విషయం తెలుసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించినట్లు తెలుస్తుంది. పురుషోత్తమ్ రెడ్డి పార్థీవ దేహానికి మంత్రి సీతక్క నివాళులర్పించడంతో ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి పట్ల మంత్రులు కొండా సురేఖ, శ్రీదర్ బాబు, గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు తీవ్ర సంతాపం తెలిపారు.

హైదరాబాద్ లోని  మహాప్రస్థానం శ్మశాన వాటికలో సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల. పురుషోత్తమ్ రెడ్డికి దేశ భక్తి ఎక్కువ..  అందుకే కొడుకునే ఆర్మీ పంపించారని అంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.  పురుషోత్తమ్ రెడ్డి బౌతికకాయానికి నివాళులర్పించేందుకు పలువురు గ్రామం నుంచి హైదరాబాద్ వస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş