Keerthi
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు నిధుల గురించి మరోసారి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈసారి రైతు భరోసా నిధులు వారికి మాత్రమే అంటూ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు నిధుల గురించి మరోసారి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈసారి రైతు భరోసా నిధులు వారికి మాత్రమే అంటూ స్పష్టం చేశారు.
Keerthi
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో.. రైతులంతా పంటల సాగు కోసం సన్నద్ధమవుతున్నారు.ముఖ్యంగా ఈ సీజన్ లో వర్షాధార పంటలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కనుక ఆ పంటలను సాగు చేసేందుకు.. తెలంగాణ రాష్ట్రాంలోని రైతులంతా ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. ప్రభుత్వం నగదు సాయం అందిస్తే.. పంట సాగుకు ఆర్థికంగా తోడవుతుందని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతు భరోసా నిధులపై తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈసారి రైతు భరోసా నిధులు వారికి మాత్రమే అంటూ స్పష్టం చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు నిధుల గురించి మరోసారి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు శుక్రవారం ( సెప్టెంబర్ 13న) జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ లో ప్రసంగించిన మంత్రి తుమ్మల.. రైతు భరోసా నిధులు విడుదలపై కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా.. రైతు భరోసా డబ్బులు ఈసారి పంట వేసి సాగు చేస్తున్న వారికే ఇస్తామని తుమ్మల స్పష్టం చేశారు. అలాగే కొండలు, గుట్టలకు ఎట్టి పరిస్థితిలో నిధులు ఇవ్వబోమని క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలామంది అనర్హులకు కూడా రైత బంధు సాయం అందించిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పులు చేయబోమని పేర్కొన్నారు. అంతేకాకుండా.. పంట వేసి సాగు చేస్తున్న ఖాతాలో మాత్రమే రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పుకొచ్చారు.
అలాగే మరోవైపు.. రైతు రుణమాఫీపై కూడా మంత్రి తుమ్మల ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇప్పటికీ రుణమాఫీ కానీ రైతులకు ఈ సెప్టెంబర్ చివరిలోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కుటుంబ నిర్ధారణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఇక రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులు ఆ ఎక్కువ మొత్తన్ని బ్యాంకుకు చెల్లించాలని మంత్రీ కోరారు. ఆ తర్వాత.. మిగిలిన రూ.2 లక్షలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. మరీ, రైతు భరోసా నిధులు విడుదలపై మంత్రి తుమ్మల ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.