iDreamPost
android-app
ios-app

కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. కనీస వేతనాలు ఖరారు!.. ఎంతంటే?

  • Published Jan 30, 2024 | 8:04 AM Updated Updated Jan 30, 2024 | 8:04 AM

తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు గుడ్ న్యూస్ అందించింది. కార్మికులకు కనీస వేతనాలను ఖరారు చేసింది. ప్రైవేట్ రంగంలోని పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు లబ్ధి చేకూరనున్నది.

తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు గుడ్ న్యూస్ అందించింది. కార్మికులకు కనీస వేతనాలను ఖరారు చేసింది. ప్రైవేట్ రంగంలోని పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు లబ్ధి చేకూరనున్నది.

  • Published Jan 30, 2024 | 8:04 AMUpdated Jan 30, 2024 | 8:04 AM
కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. కనీస వేతనాలు ఖరారు!.. ఎంతంటే?

దేశ ప్రగతిలోనైనా రాష్ట్ర ప్రగతిలోనైనా కార్మికులు కీలక పాత్ర పోషిస్తారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులను ఆదుకునేందుకు పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. బీమా పథకాలను ప్రవేశపెట్టడం, వేతనాలు పెంచడం, కార్మికులకు సౌకర్యవంతమైన పనిగంటలను కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు గుడ్ న్యూస్ అందించింది. కార్మికులకు కనీస వేతనాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కార్మిక శాఖ నిర్ణయంతో ఆయా రంగాల్లో పనిచేసే కార్మికులకు లబ్థి చేకూరనున్నది.

తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఖరారు చేసింది. దీనికి సంబంధించి కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతినెలా 26 రోజుల పనిదినాలుగా నిర్ణయించింది. రోజుకి ఎనిమిది గంటల పని సమయాన్ని ఖరారు చేసింది. సమాన పనికి స్త్రీ, పురుషులకు సమాన వేతనాలు ఇవ్వాలని కార్మిక శాఖ ఆదేశించింది. అయితే కార్మిక శాఖ ఖరారు చేసిన వేతనాల కన్నా ఎక్కువ వేతనాలు పొందితే మాత్రం ఆ వేతనాలనే కొనసాగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

పెట్రోలు బంకులు, ప్రైవేటు విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది, పేపర్‌, పేపర్‌బోర్డులు, చేతితో పేపర్‌ తయారీ ఉత్పత్తుల కర్మాగారాలు, కోళ్లఫారాలు, హేచరీలు, దాణా ఉత్పత్తి సంస్థలు, ప్రింటింగ్‌ ప్రెస్‌లు, ప్రైవేటు మోటారు రవాణా సంస్థలు, కల్లు దుకాణాల్లో పనిచేసేవారు, టింబర్‌ డిపో, మార్కెటింగ్‌ సొసైటీలు, మైకా, సిమెంటు కర్మాగారాలు.. ఇలా వివిధ రంగాల్లోని కార్మికులకు కనీస వేతనాలు, నివాసభత్యం నిర్ణయిస్తూ కార్మికశాఖ నిర్ణయం తీసుకుంది.

నగరాలు, పట్టణాలు, గ్రామాల ప్రాతిపదికన ప్రైవేటు విద్యాసంస్థల్లో కనీస వేతనాలు రెండు జోన్లుగా విభజించింది. కార్మిక శాఖ ఖరారు చేసిన తాజా వేతనాల ప్రకారం.. విద్యాసంస్థ క్యాంపస్‌ ఇన్‌ఛార్జికి జోన్‌-1లో రూ.36082, జోన్‌-2లో రూ.31,918గా ఖరారు చేసింది. ఇక పెట్రోలు బంకుల్లో సేల్స్‌మెన్‌కు నెలకు రూ.12,304, పంపు అటెండర్‌కు రూ.12,096, హెవీ వెహికల్‌ డ్రైవర్‌కు నెలకు రూ.13,093, లైట్‌మోటార్‌ వెహికల్‌ డ్రైవర్‌కు రూ.12,057, కోళ్లఫారాల్లో వర్కర్లకు నెలకు రూ.11,521గా తెలంగాణ కార్మిక శాఖ నిర్ణయించింది.

Jojobet GirişJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet