తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌..

TS Inter Resaults 2024: విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.

TS Inter Resaults 2024: విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం నాడు అనగా.. ఏప్రిల్‌ 24, ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఎగ్జామ్‌ రిజల్ట్స్‌ విడుదల చేశారు. నేడు ఫలితాలు ప్రకటిస్తామని.. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. విద్యార్థులు https:// tsbie. cgg. gov. in లేదా https:// results. cgg. gov. in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.

బుర్రా వెంకటేశం.. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ, ఒకేషనల్ పలితాలు ప్రకటించారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 2,87,261 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 60.01 గా నమోదయ్యింది. ఇక సెకండియర్‌లో 3,22,432 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 64.19 గా పేర్కొన్నారు. ఇంటర్‌ ఒకేషనల్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 24,432 మంది పరీక్షలు రాయగా.. వారిలో 50.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్‌ ఇయర్‌లో ఒకేషనల్‌లో 42,723 పరీక్షలు రాస్తే 27,287 మంది పాస్‌ అయ్యారు. ఇక ప్రైవేట్‌గా 3,884 పరీక్షలు రాయగా.. వారిలో 1549 మంది పాస్‌ అయ్యారు.

ఈసారి కూడా ఇంటర్ ఫలితాలల్లో బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతంలో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇక సాయంత్రం 5 గంటల నుండి మెమోలు అందుబాటులో ఉంచనున్నారు. రేపటి నుండి వచ్చే నెల 2 వరకు రీ వెరిఫికేషన్, రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వచ్చే నెల 24 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు.

ఇక ఈ ఏడాది తెలంగాణలో సుమారు 9 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉండగా.. 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. మార్చిలోనే పరీక్షలు పూర్తి కాగా.. వీరంతా రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంతో.. త్వరగా ఫలితాలను వెల్లడించాలని విద్యార్థులు కోరారు. బోర్డు కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇక ఇంటర్‌ ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే తెలంగాణ పదో తరగతి రిజల్ట్స్‌ వచ్చే అవకాశం ఉంది.

Show comments