TG Govt Will Increase Beer Price: తెలంగాణ మందుబాబులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరగనున్న బీర్ల ధరలు!

Beer Price: తెలంగాణ మందుబాబులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరగనున్న బీర్ల ధరలు!

Telangana-Beer Price: తెలంగాణ మందుబాబులకు ఇది భారీ బ్యాడ్‌న్యూస్‌ అని చెప్పవచ్చు. త్వరలోనే రాష్ట్రంలో బీరు ధరలు ఒక్కసారిగే పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఆ వివరాలు..

Telangana-Beer Price: తెలంగాణ మందుబాబులకు ఇది భారీ బ్యాడ్‌న్యూస్‌ అని చెప్పవచ్చు. త్వరలోనే రాష్ట్రంలో బీరు ధరలు ఒక్కసారిగే పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఆ వివరాలు..

దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇక ఇదే ఛాన్స్‌గా ప్రభుత్వాలు మద్యం రేట్లను భారీగా పెంచినా.. జనాలు మాత్రం వెనకడుగు వేయడం లేదు. ధర ఎంత పెరిగినా.. తగ్గేదేలే అన్నట్లుగా మద్యం సేవిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం లిక్కర్‌ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. రాష్ట్రంలోని మందుబాబులకు భారీ షాక్‌ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. త్వరలోనే రాష్ట్రంలో బీర్ల ధరలు పెరగనున్నాయి. ఎంత మేర పెంచుతుంది.. ఎందుకు ఈ నిర్ణయం వంటి వివరాలు మీ కోసం..

త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. బీర్ల తయారీ కేంద్రాల (బ్రూవరీల)కు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10-12 శాతం మేర పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం కారణంగా వినియోగదారులపై ఈ భారం పడనుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరు బ్రూవరీల్లో ఏటా 68 కోట్ల లీటర్ల బీరు తయారు అవుతోంది. ఆ బీరును తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌బీసీఎల్‌) కొనుగోలుచేసి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు సరఫరా చేస్తోంది.

ఈ నేపథ్యంలో 12 బీర్ల కేసుకుగాను బ్రూవరీలకు టీఎస్‌బీసీఎల్‌ రూ.289 చెల్లిస్తోంది. పన్నులన్నీ కలుపుకొని కేసుకు రూ.1400 చొప్పున రిటైలర్లకు (మద్యం దుకాణాలు) విక్రయిస్తుంది. ఇతర ఖర్చులన్నీ కలుపుకుని మద్యం దుకాణాలవారు కేసు రూ.1800లకి అమ్ముతున్నారు. అంటే.. ఒక్కో బీరునూ ప్రభుత్వం బ్రూవరీల వద్ద రూ.24.08కి కొనుగోలు చేసి రూ.116.66కి మద్యం దుకాణాలకు విక్రయిస్తుండగా.. వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ఒక్కో బీరు ధరా రూ.150 అవుతోంది అన్నమాట.

ఇక రాష్ట్రంలో బీర్ల డిమాండ్‌కు తగ్గట్టు ప్రభుత్వ ఆర్డర్లపై బ్రూవరీలు వాటిని ఉత్పత్తి చేస్తాయి. ఈ మేరకు బ్రూవరీలతో ప్రభుత్వం కుదుర్చుకునే ఒప్పందం.. రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. ఆ గడువు పూర్తయ్యాక ధరలను సవరించి.. మళ్లీ రెండేళ్ల పాటు ఒప్పందాన్ని కొనసాగిస్తారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రభుత్వం బ్రూవరీలకు చెల్లించే ధరను దాదాపు 10 శాతం మేర పెంచుతూ ఉంటుంది.

చివరిసారిగా రెండేళ్ల క్రితం అనగా 2022 మే నెలలో ప్రభుత్వం బ్రూవరీలకు చెల్లించే ధరను 6 శాతం చొప్పున రెండుసార్లు పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈసారి 20-25 శాతం పెంచాలంటూ బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేర పెంచినట్లయితే ధరలను పెంచాల్సి ఉంటుంది. ఈ భారం వినియోగదారుల మీదనే పడనుంది. దీంతో ప్రభుత్వం వినియోగదారులపై ఎక్కువ భారం పడకుండా చూడటం కోసం.. ఈ మొత్తాన్ని 10-12శాతం వరకూ పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. కొత్త ధరలు వచ్చే నెల నుంచి అనగా సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిసింది. ఒక వేళ ప్రభుత్వం ధరలు పెంచాలని నిర్ణయిస్తే కేవలం బీరు ధరలు మాత్రమే పెరుగుతాయి. మిగతావాటి ధరల్లో మార్పు ఉండదు అంటున్నారు.

Show comments