iDreamPost
android-app
ios-app

భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం!

  • Published Jun 15, 2024 | 3:41 PM Updated Updated Jun 15, 2024 | 3:41 PM

Telangana Govt: శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారీగా ఐఏఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Govt: శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారీగా ఐఏఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Published Jun 15, 2024 | 3:41 PMUpdated Jun 15, 2024 | 3:41 PM
భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు అధికారుల బదిలీలు జరిగాయి. ఈసారీ మాత్రం తెలంగాణలో భారీగా ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ స్థాయిలో ఐఏఎస్ ల బదిలీలు జరగడంఇదే తొలిసారి. మరి.. ఏ ఏ జిల్లాలలకు కొత్తగా కలెక్టర్లు నియమితులయ్యారో, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారీగా ఐఏఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా తాజాగా బదిలీలతో ఆయా జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమాకం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దిరోజులకు తాత్కాలిక బదిలీలు జరిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో పలు స్థానాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని మార్చింది. సరిగ్గా అదే సమయంలో లోక్‌సభ ఎన్నికల  కోడ్ అమల్లోకి రావడంతో నియమావళి అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. ఇటీవలే ఎన్నికల ఫలితాలు రావడంతో కోడ్ ముగిసింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్దఎత్తున మార్పులు చేసింది.

ఇక బదిలీల్లో భాగంగా వివిధ జిల్లాలకు కొత్తగా నియమితులైన కలెక్టర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.. ఖమ్మం జిల్లాకు ముజామిల్‌ ఖాన్న, నాగర్‌కర్నూల్‌ జిల్లాకి సంతోష్‌, భూపాలపల్లి జిల్లాకు రాహుల్‌శర్మ, కరీంనగర్‌ జిల్లాలకు అనురాగ్‌ జయంతిని నియమించారు. అలానే కరీంనగర్ పక్కనే ఉన్న పెద్దపల్లి జిల్లాకు కోయ శ్రీహర్ష, అలానే  జగిత్యాల జిల్లాకి సత్యప్రసాద్‌, మంచిర్యాల జిల్లాకు కుమార్‌ దీపక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాకు విజయేంద్ర కలెక్టర్లుగా నియమితులయ్యారు.

హనుమకొండ జిల్లాకు ప్రావీణ్య, నారాయణపేట్‌ జిల్లాకు సిక్తా పట్నాయక్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్‌కుమార్‌ ఝ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జితేష్‌ వి పాటిల్‌ లను కలెక్టర్లుగా నియమించారు. అదే విధంగా వికారాబాద్‌ జిల్లాకు ప్రతీక్‌ జైన్‌, కామారెడ్డి జిల్లాకు ఆశిష్‌ సంగ్వాన్‌, నల్గొండ జిల్లాకు నారాయణరెడ్డి, వనపర్తి జిల్లాకు ఆదర్శ్‌ సురభి, సూర్యాపేట జిల్లాకి తేజస్‌ నందలాల్‌ పవార్‌, వరంగల్‌ జిల్లాకు సత్య శారదాదేవి, ములుగు జిల్లాకు దివాకరా, నిర్మల్‌ జిల్లాకు అభిలాష అభినవ్‌ కలెక్టర్లు గా నియమించారు. మొత్తంగా 20 ఐఏఎస్ లను బదిలీ చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom