Dwakra Group loan: తెలంగాణలో లక్ష మంది మహిళలకు వడ్డీ లేని ఋణాలు! అర్హతలివే!

రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరలుగా చేయడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతోంది. రాష్ట్రంలోని 64 లక్షల మంది స్వయం సహాయక సంఘాలకు సభ్యులకు ఐదేండ్లలో లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరలుగా చేయడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతోంది. రాష్ట్రంలోని 64 లక్షల మంది స్వయం సహాయక సంఘాలకు సభ్యులకు ఐదేండ్లలో లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా అక్కాచెల్లెమ్మలకు పెద్ద పీట వేస్తోంది. మహిళా ప్రాధాన్యత ప్రభుత్వంగా పేరు గడిస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు, యవతులు, విద్యార్థినులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తోంది. అలాగే గృహ జ్యోతి పథకాన్ని అమలు చేసింది. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడితే.. బిల్లు కట్టనవసరం లేదు. అలాగే.. రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తోంది. తాజాగా కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది.

డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు తెలంగాణ  ప్రభుత్వం సిద్ధం అయ్యింది. సున్న వడ్డీతో మహిళలకు రుణాలు మంజూరు  చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రతి సభ్యురాలికి వ్యక్తిగత జీవిత భీమాను కూడా చేయనుంది. తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక భరోసానిచ్చేందుకు ‘తెలంగాణ మహిళాశక్తి’ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ పథకం ద్వారా రాబోయే ఐదేళ్లలలో రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించనున్నారు. గ్రామాల్లో మహిళా వ్యాపార వేత్తలను తయారు చేయాలన్న ఉద్దేశంతో సున్న వడ్డీ రుణాలను అందించేందుకు సంకల్పించనుంది. దీని  కోసం ప్రతి నియోజవర్గం పరిధిలో ప్రత్యేక మినీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణ  మహిళా శక్తి భాగంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. 2014 నుంచి అమల్లో ఉన్న ఈ పథకంలో.. మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుని సకాలంలో చెల్లిస్తే, వారు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. 2019-20 వరకు ప్రభుత్వం ఈ వడ్డీలపై  రాయితీ ఇచ్చింది.  ఆ తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పథకానికి నిధులు నిలిచిపోయాయి. గతంలో బకాయి ఉన్న నిధులను కూడా ప్రభుత్వం చెల్లించనుంది. ఇకపై ప్రతి 6 నెలలకోసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రీఎంబర్స్‌మెంట్‌ చేస్తుంది. వీటితోపాటు మహిళా సంఘాలకు మరికొన్ని స్కీమ్స్ ను కూడా ప్రభుత్వం అమలు చేయనుంది.

ఒక్కో గ్రామ సమాఖ్య పరిధిలోని సంఘాలకు రూ.కోటి వరకు రుణాలు మంజురూ ఇస్తారు. మొదటి ఏడాది రాష్ట్రంలోని 5 వేల గ్రామాలకు రూ.5 వేల కోట్ల వరకు రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. వీటి ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో ప్రత్యేక చిన్నతరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తారు.  ఇలా డ్వాక్రా సంఘాల మహిళలందరికీ ఉపాధితో పాటు ఆర్థికంగా బలోపేతం అయ్యే కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుంది. సకాలంలో వడ్డీలు చెల్లించిన వారికి మహిళా సంఘాలకు ఆ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తుంది. స్థానిక మహిళలు, తెల్లరేషన్ కార్డు కలిగిన వారే ఈ బుణాలకు అర్హులని తెలుస్తోంది.

Show comments