Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోంది. ఈ క్రమంలో త్వరలో ప్రభుఉత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పడానికి రెడీ అయ్యింది. ఆ వివరాలు..
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోంది. ఈ క్రమంలో త్వరలో ప్రభుఉత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పడానికి రెడీ అయ్యింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చింది. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆరు గ్యారెంటీల అమలుకు తీవ్రంగా కృషి చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కొన్ని హామీలను అమలు చేయగా.. ఎలక్షన్ ముగియడంతో.. మిగతా గ్యారెంటీల అమలుకు మార్గదర్శకాలు రెడీ చేసే పనిలో ఉంది. ఆగస్టు 15 నాటి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ అమలు పూర్తి చేస్తామని ప్రకటించింది. సామాన్యులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూడా రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం సర్కార్ కొలువు చేస్తున్న వారికి శుభవార్త చెప్పింది. వారు ఏళ్లుగా ఎదురు చూస్తోన్న సమస్య పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వివరాలు..
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న బదిలీలకు సంబంధించి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదేళ్ల తర్వాత బదిలీలపై నిషేదాన్ని ఎత్తివేస్తూ.. ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఈ ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ మేరకు ఈ నెల 5 నుంచి జులై 20 వరకు బదిలీలకు షెడ్యూల్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా.. ఎంతో పారదర్శకంగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మెుత్తం ఏడు అంశాల ఆధారంగా ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు.
బదిలీ ప్రక్రియలో స్పౌజ్, 2025 జూన్ 30 లోగా రిటైర్డ్ అయ్యేవారు, వితంతువులు, కొన్ని కేటగిరీల అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి.. సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ జీవో 80 విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయింయించడమే కాక అందుకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలను కూడా వెల్లడించింది.
వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల వద్ద నుంచి ఆప్షన్లను స్వీకరించి, బదిలీ ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈక్రమంలో అధికారులు.. జులై 5-8 వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఖాళీలు, కచ్చితంగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలను వెల్లడించేందుకుసిద్దమయ్యారు. జులై 9-12 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుని.. జులై 13-18 వరకు ట్రాన్స్‌ఫర్ అఫ్లికేషన్లు పరిశీలించనున్నారు. జులై 19, 20వ తేదీల్లో బదిలీల ఉత్తర్వులను జారీ చేస్తారు. అనంతరం జులై 21 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుంది.