P Venkatesh
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు శుభవార్త అందించింది. ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు శుభవార్త అందించింది. ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.
P Venkatesh
తెలంగాణలో గత నెల 24న ఇంటర్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో పలువురు విద్యార్థులు రికార్డ్ మార్కులతో చరిత్ర సృష్టించారు. ఫస్టియర్‌లో 2,87,261 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత 60.01 శాతంగా నమోదయ్యింది. సెకండియర్‌లో 3,22,432 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 64.19శాతంగా వెల్లడించారు. ఇక ఇంటర్ లో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డ్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని అధికారులు వెల్లడించారు.
ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ గుడ్ న్యూస్ అందించింది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. మే 4వ తేదీ వరకు ఫెయిలైన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాలు విడుదలైన రోజు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ మే 2వ తేదీతో ముగిసింది. అయితే పలువురు విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని మే 4వ తేదీ వరకు పొడిగించారు.