సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. RDO వ్యవస్థ రద్దు!?

తెలంగాణ వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసి సంచలనం సృష్టించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్డీఓ వ్యవస్థను సైతం రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రెవెన్యూ డివిజన్‌ ఆఫీసర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి వారిని వేరే శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన రెవెన్యూ డివిజన్‌ అధికారి పోస్టు కనుమరుగు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇటీవల కొంతమందికి ప్రమోషన్లు కూడా ఇచ్చారు. అంతా కలుపుకుని దాదాపు 90 మంది వరకు ఆర్డీఓలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరి వ్యవస్థ రద్దు చేస్తే వీరందరినీ మళ్లీ వేరే శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. అయితే వారికి అప్పగించే విధులపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

కాగా, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్య సేవలు ఎక్కడ అందుతున్నాయి. ఒక వేళ వైద్య సేవలు సక్రమంగా అందని పక్షంలో ఎవరిని సంప్రదించాలో తెలియన చాలా మంది ప్రజలు, రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడ్మినిస్ట్రేషన్‌ సమస్యల పరిష్కారం కోసం ఆర్డీఓలను వినియోగిస్తారనే ప్రచారం మాత్రం జరుగుతోంది. మరి దీనిపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. కాగా.. దీనిపై తెలంగాణ శాసన మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అన్నదాతలకు KCR సర్కార్‌ మరో తీపి కబురు.. త్వరలోనే నిర్ణయం!

Show comments