రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్!

Ration Card: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వారికి తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Ration Card: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వారికి తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ దిగ్విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. సీఎం గా రేవంత్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టారు.నాటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూకుడు కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష నేతల సవాళ్లకు ధీటుగా సమాధానమిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేశారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు. తాజాగా రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. వివరాల్లోకి వెళితే..

కుటుంబాల నుంచి వేరు పడినవారు, పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత పిల్లలు కలిగిన వారు, అత్తవాంటికి వెళ్లిన ఆడపడుచులు కొత్త రేషన్ కార్డుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను ఇతర వివరాలను నమోదు చేసే అవకాశం కల్పిస్తుంది. అంతేకాదు రేషన్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు సైతం చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం మీసేవ సెంటర్ల వద్దకు వెళ్లి కావాల్సిన ధృవపత్రాలు అందించాలి. మీసేవ సెంటర్ లో మీ కుటుంబ సభ్యుల పేరుని నమోదు చేసి వారికి సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఆధార్ కార్డులు, పిల్లల జనన ధృవీకరణ పత్రాలు, భార్యపేరు నమోదు చేయాల్సి వస్తే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాలి. పూర్తి వివరాలు అందించిన తర్వాత మీసేవ సెంటర్లలో నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత అధికారిక వెబ్ సైట్ లో మీ రేషన్ కార్డు ఆన్ లైన్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.

ఇటీవల ప్రజాపాలనలో భాగంగా రేషన్ కార్డుల కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రేవంత్‌ సర్కార్‌ చెబుతోంది. ఇదిలా ఉంటే..ఇటీవల తెలంగాణ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరావు.జనవరి నుంచి రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. గురుకులాలకు, సంక్షేమ పాఠశాలలకు సన్న బియ్యం ఇస్తామని వెల్లడించారు. దశాబ్దాలుగా భారతదేశ సాంఘిక సంక్షేమ వ్యవస్థలో రేషన్ కార్డులు అంతర్భాగంగా ఉన్నాయి.ఆహార భద్రత, జనాభాలో నిత్యావసర వస్తువుల సమాన పంపిణీని నిర్ధారించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (BPL) వర్గంలో ఉన్న వారికి రేషన్ కార్డ్ మంజూరు చేయబడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి వంటి అనేక అంశాలపై దృష్టిసారిస్తుందని అన్నారు. మొత్తానికి ఎప్పటి నుంచో తమ కుటుంబ సభ్యులు పేర్లు నమోదు చేసుకోవాలని ఎదురు చూస్తున్న వారికి ఇది బంపర్ ఆఫర్ అని అంటున్నారు. ప్రస్తుత రేషన్ కార్డులను వీలైనంత త్వరగా సరిచేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

Show comments