iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 14 నుంచి వరుస సెలవులు..

  • Published Sep 13, 2024 | 11:57 AM Updated Updated Sep 13, 2024 | 11:57 AM

సెప్టెంబర్‌ నెలలో అన్ని విద్య సంస్థలకు ప్రభుత్వం వరుస సెలవులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోమారు విద్యార్థులకు ఈనెల 14 నుంచి వరుస సెలవులు ప్రకటించనున్నారు.

సెప్టెంబర్‌ నెలలో అన్ని విద్య సంస్థలకు ప్రభుత్వం వరుస సెలవులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోమారు విద్యార్థులకు ఈనెల 14 నుంచి వరుస సెలవులు ప్రకటించనున్నారు.

  • Published Sep 13, 2024 | 11:57 AMUpdated Sep 13, 2024 | 11:57 AM
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 14 నుంచి వరుస సెలవులు..

సాధారణంగా స్కూల్స్, కాలేజీలు సెలవులు వస్తే చాలు.. విద్యార్థులు సంతోషంతో ఎగిరి గంతేస్తారు. అయితే ఇప్పటికే ఈ ఏడాది విద్య సంస్థలకు వేసవి సెలవుల దగ్గర నుంచి వివిధ పండుగల వరకు సెలవులు బాగానే ఇచ్చారు. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో అయితే విద్యార్థులకు సెలవులు ఎక్కువగానే ఇచ్చారు. ఎందుకంటే.. పండుగలు, వర్షాలు కారణంగా వరుస సెలవులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా విద్యార్థులకు మరోమారు వరుస సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకీ ఎన్ని రోజులంటే..

విద్య సంస్థలకు ఈ సెప్టెంబర్‌ నెలలో ప్రభుత్వం వరుస సెలవులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోమారు విద్యార్థులకు ఈనెల 14 నుంచి వరుస సెలవులు ప్రకటించనున్నారు. అయితే ఈ సెలవులు ఈ వారం చివరి నుంచి వచ్చే వారం ప్రారంభం వరకు ఉన్నాయి. దీంతో పాఠశాల,కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పండగే అనే చెప్పవచ్చు. కానీ, ఈ సెలవులు అనేవి కొన్ని రాష్ట్రాల్లో నాలుగు, ఐదు రోజులు కాగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాంలో ఈ నెల 17వ తేదీన గణేష్ నిమర్జనాలు కారణంగా.. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు రోజు ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే అదే రోజు మిలాద్ ఉన్ నబీ పండుగా కావడంతో ఏపీలో కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు దినం ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. విద్య సంస్థలకు సెలవులు అనేవి రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి. అయితే రేపు సెప్టెంబర్ 14వ తేదీ రెండో శనివారం, 15వ తేదీ ఆదివారం కావడం వరుసగా రెండు రోజులు  సెలవులు రానున్నాయి. అలాగే 17వ తేదీన మీలాద్  ఉన్ నబీ  పండుగతో పాటు తెలంగాణ వినాయక నిమజ్జనోత్సవం కారణంగా వరుసగా 3 రోజులు పాటు విద్య సంస్థలకు సెలవులు ప్రకటించారు.

 సెప్టెంబర్‌ నెలలో విద్య సంస్థల హాలిడేస్‌ లిస్ట్‌

  • సెప్టెంబర్‌ 14 రెండో శనివారం
  • సెప్టెంబర్ 15 ఆదివారం సెలవు
  • సెప్టెంబర్ 17 మీలాద్ ఉన్ నబి పబ్లిక్ హాలిడే
  • సెప్టెంబర్ 22 ఆదివారం అందరికీ సెలవు
  • సెప్టెంబర్ 28 నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు
  • సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం అందరికీ సెలవు

మరీ, ఈ సెప్టెంబర్‌ నెలలో ఈ వారం చివరి నుంచి వచ్చే వారం ప్రారంభం వరకు అన్ని విద్య సంస్థలకు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం సెలవులు ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.